WhatsApp Feature: వ్యక్తిగత ప్రైవసీ, టెక్నాలజీ పరంగా యూజర్లకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) మరో సరికొత్త ఫీచర్ ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఈ చాట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. యూజర్లకు అధునాతన ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా మెటా సంస్థ దీనిని రూపొందిస్తోంది. సమ్మరైజెస్ ఫీచర్ ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ (Apple Intelligence) మాదిరిగానే ఉంటుంది. కాకపోతే వాట్సప్ సమ్మరైజెస్ ఫీచర్ ఎక్కువ డివైజులలో అందుబాటులో ఉంటుంది.
Read this- Plane Crash: నిజంగా మిరాకిల్.. మృత్యుంజయుడు కాకపోతే మరేంటి?
చాట్‌ల సారాంశం
యూజర్లకు త్వరలో అందుబాటులోకి రాబోతున్న ఫీచర్ పేరు ‘చాట్ సమ్మరైజెస్’ (WhatsApp’s AI summaries). యూజర్లు ఈ ఫీచర్‌పై క్లిక్ చేస్తే, చాటింగ్ సారాంశాన్ని క్లుప్తంగా ఒకే దగ్గర చేర్చుతుంది. మెసేజులన్నీ చదవకుండానే అవతల వ్యక్తి చాటింగ్ సారాంశాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే చాట్‌లో చివరి మెసేజ్‌కు బదులు కొత్తగా ‘సమ్మరైజెస్ విత్ మెటా ఏఐ’ (Summaries With Meta AI) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై ట్యా్ప్ చేయగానే చాటింగ్ సారాంశాన్ని క్రోడీకరిస్తుంది. దీంతో, మెసేజులు అన్నీ అన్ని చదవకుండానే సులభంగా అర్థమైపోతుంది. వ్యక్తిగతంగా లేదా గ్రూపులో చాటింగ్‌లలో పంపించిన పొడవైన మెసేజుల సారాంశాన్ని పొందేందుకు కూడా ఈ ఫీచర్ చాలా సహాయ పడుతుంది.
Read this- Plane Crash: విమానం ఎందుకు కూలింది?.. ఇంజనీర్ ఏం చెప్పారు?
ప్రస్తుతానికి టెస్టింగ్‌లో…
వాట్సప్‌బెటాఇన్ఫో రిపోర్ట్ ప్రకారం.. ఏఐ సమ్మరైజెస్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుందని రిపోర్ట్ పేర్కొంది. యూజర్లకు అధునాతన ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా మెటా సంస్థ దీనిని రూపొందిస్తోంది.