Virat Kohli (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Virat Kohli: ఐపీఎల్‌లో ఫస్ట్ ట్రోఫీ.. కెప్టెన్‌కు కోహ్లీ అదిరిపోయే గిఫ్ట్.. వీడియో వైరల్!

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2025  (IPL 2025) ఫైనల్స్ లో సంచలనం నమోదైన సంగతి తెలిసిందే. పంజాబ్ (Punjab Kings)పై సూపర్ విక్టరీ సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ ప్రారంభమైన 2008 ఏడాది నుంచి కప్ కోసం ఆ జట్టు ఎంతగానో శ్రమించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో కప్ ముంగిట వరకూ వచ్చి తమ చిరకాల స్వప్నాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ సారి రజత్ పాటిదార్ (Rajat Patidar)  కెప్టెన్సీలో కోహ్లీ తన కలను సాకారం చేసుకున్నాడు. దీంతో తమ సారథికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి కోహ్లీ సర్ ప్రైజ్ చేశాడు.

ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే?
బెంగళూరుకు ఐపీఎల్ ట్రోఫీ కలను నెరవేర్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆర్‌సీబీ విజయోత్సవాల అనంతరం.. ఆ జట్టు మాజీ ప్లేయర్ ఏబీ డీవిలియర్స్ (AB de Villiers)తో కలిసి కోహ్లీ డ్రెసింగ్ రూమ్ (RCB Dressing Room) లోకి వెళ్లాడు. ఈ సందర్భంగా టీమ్ మేట్స్ తో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ అక్కడే కూర్చొని ఉన్నారు. గదిలోకి వెళ్లగానే రజత్ ను చూసిన కోహ్లీ వెంటనే తన బ్యాట్స్ పెట్టిన ప్రాంతానికి వెళ్లాడు. అందులో ఒకదానిని అందుకొని బహుమతిగా రజత్ పాటిదార్ వైపునకు విసిరాడు. అది అందుకున్న రజత్.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిజానికి కోహ్లీ తన బ్యాట్ ను ఎవరైనా అడిగితే గానీ ఇవ్వడు. చాలా సెంటిమెంట్ గా భావిస్తుంటాడు. అలాంటిది రజత్ పాటిదార్ అడగకుండానే ఇవ్వడాన్ని చూస్తే ఈ విజయం తనకు ఎంతటి ఆనందాన్ని ఇచ్చిందో కోహ్లీ చెప్పకనే చెప్పాడని అర్ధమవుతోంది.

కెప్టెన్‌గా సూపర్ సక్సెస్!
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రజత్ ను ఆర్సీబీ కెప్టెన్ గా అనౌన్స్ చేయగా.. అందరిలో ఏదో తెలియని అనుమానం. కొత్త కుర్రాడు తమ 17 ఏళ్ల కలను సాకారం చేస్తాడా అని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే సీజన్ ప్రారంభం నుంచే తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఆర్సీబీ విజయపథంలో నడిపాడు రజత్ పాటిదార్. ఒత్తిడి సమయాల్లోనూ ఏ మాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా జట్టును ముందుడి నడిపించిన విధానం అందరినీ మెప్పించింది. మధ్యప్రదేశ్ జట్టును 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy 2024) ఫైనల్‌కు నడిపించిన అనుభవం రజత్ కు ఐపీఎల్ లో బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. సీజన్ మధ్యలో గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైనా ఆ తర్వాత గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన విధానాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే.

Also Read: Punjab Youtuber Arrested: పాక్‌తో లింకులు.. మరో యూట్యూబర్ అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

బ్యాటర్‌గానూ రాణింపు
ఐపీఎల్ 2025 సీజన్ లో మంచి కెప్టెన్ గానే కాకుండా ఆర్సీబీ తరపున బ్యాటర్ గానూ రజత్ పాటిదార్ రాణించాడు. ఈ సీజన్‌లో అతను 13 ఇన్నింగ్స్‌లలో 395 రన్స్ స్కోర్ చేశాడు. 177.13 స్ట్రైక్ రేట్‌తో 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇది ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్‌కు బలాన్ని చేకూర్చింది. అంతేకాదు ఐపీఎల్ లో అత్యంత వేగంగా 1000 పరుగులు (30 ఇన్నింగ్స్‌లలో) సాధించిన రెండో బ్యాటర్ గానూ గుర్తింపు పొందాడు. 35కి పైగా యావరేజ్, 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

Also Read This: Tragedy in Agra: రీల్స్ నింపిన విషాదం.. ఒకే ఫ్యామిలీలో ఆరుగురు బలి.. ఏమైందంటే?

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?