Pet dog
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: రైల్లో పెంపుడు కుక్కను కట్టేసి వెళ్లిన యజమాని!.. అనూహ్య ఘటన

Viral News: కొంతమంది వ్యక్తులు తమ పెంపుడు జంతువుల పట్ల బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుంటారు. అనాలోచితంగా వాటిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు మరికొందరు. శునకాలు, పిల్లులు వంటి జంతువులను సుదూర ప్రయాణ సమయంలో వదిలేస్తుంటారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూనే ఉంటాయి. ఈ తరహా ప్రయత్నాలు జంతువుల భద్రతకే కాక, ప్రజలకూ ప్రమాదకరం కావచ్చు. ఇలాంటి ఘటనే ఒకటి బిహార్‌లో (Viral News) వెలుగుచూసింది.

బిహార్‌లోని రక్సౌల్ నుంచి సమస్తీపూర్ వెళ్లే రైలు.. స్టేషన్‌లో గంటకు పైగా ఆగిపోయింది. ప్రయాణికులంతా చాలా ఓపిక, నిరాశతో నిరీక్షించాల్సి వచ్చింది. ఇందుకు కారణం ఏంటంటే, రైలులోని ఒక కోచ్‌లో సీటుకు ఓ పెంపుడు కుక్కను కట్టేసి, యజమానులు వదిలేసి వెళ్లిపోయారు. ప్రయాణికులు ఆ కోచ్‌లోకి ఎక్కుతుంటే వారిపై మొరుగుతూ ఇబ్బంది పెట్టింది. ఈ సమస్యకు రైలు సిబ్బంది కూడా పరిష్కారం కనుగొనలేకపోయారు.

Read Also- Jogulamba Temple: వివాదస్పదమవుతున్న జోగులాంబ ఆలయం.. అసలు కారణం అదేనా..!

ప్రయాణికులు ఎక్కబోతుండగా..

55578 నంబర్ ట్రైన్ సోమవారం ఉదయం 6.50 గంటలకు రక్సౌల్ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే, ఓ తెల్ల రంగు పెంపుడు శునకాన్ని ఓ కోచ్‌లోని ఒక సీటుకు కట్టేసి ఉండడాన్ని ప్రయాణికులు గమనించారు. ఆ కోచ్‌లోకి ఎక్కేందుకు ప్రయాణికులు ప్రయత్నించగా, వారిని చూసి ఆ కుక్క అరవడం మొదలుపెట్టింది. కొందరిపైకైతే దూకే ప్రయత్నం కూడా చేసింది. దీంతో, ప్రయాణికులు ఆ కోచ్ ఎక్కకుండా వెనక్కి తగ్గారు. రైల్వే సిబ్బంది పరిశీలించినా ఏం చెయ్యాలో పాలుపోక నిస్సహాయులుగా మిగిలారు.

Read Also- CPI Mahasabha: ఈ నెల 20 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు: కూనంనేని సాంబశివరావు

రైల్వే సిబ్బంది ధైర్యం చేసి కుక్కను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినప్పటికీ, అవన్నీ విఫలమయ్యాయి. చివరకు ఆ కుక్కను సీటుకే అలాగే ఉంచి, ఆ కోచ్‌ను ఖాళీగా వదిలేశారు. దీంతో, రైలు దాదాపు గంట ఆలస్యంగా, ఉదయం 8:10 గంటల సమయంలో రక్సౌల్ రైల్వే స్టేషన్ నుంచి గమ్యస్థానం వైపు బయలుదేరింది. కొందరు ప్రయాణికులు కుక్క వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారాయి. దీంతో, పెంపుడు కుక్కను రైలులో వదిలేసి వెళ్లడాన్ని చాలామంది తీవ్రంగా తప్పుబట్టారు. యజమాని ఆ కుక్కను ప్రయాణంలో వదిలేసి వెళ్లిపోయినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణ మొదలుపెట్టింది. రైల్వే అధికారులు స్పందిస్తూ, ఈ చర్యను కేవలం అభద్రతతో కూడుకున్నది మాత్రమే కాదని, రైల్వే టైమ్ టేబుల్‌కు కూడా అంతరాయం కలిగించే చర్యగా పేర్కొన్నారు. కాగా, ఈ తరహా ఘటనలు జంతువుల భద్రతకే కాకుండా, ప్రజలకూ ప్రమాదకరం కావచ్చు. కాబట్టి, పెంపుడు జంతువుల యజమానులు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read Also- Apple Company: కనీవినీ ఎరుగని మొత్తంతో ఓ భవనాన్ని లీజుకు తీసుకున్న యాపిల్

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ