Apple India
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Apple Company: కనీవినీ ఎరుగని మొత్తంతో ఓ భవనాన్ని లీజుకు తీసుకున్న యాపిల్

Apple Company: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ (Apple Inc) కంపెనీ భారత్‌లోని బెంగళూరు నగరంలో ఒక భారీ ఆఫీస్‌ను పదేళ్ల కాలానికి లీజుకుంది. దాదాపు 2.7 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను 10 సంవత్సరాల పాటు లీజ్‌కు తీసుకుంది. ఇందుకుగానూ ప్రతి నెలా రూ. 6.3 కోట్లు అద్దె చెల్లించనుంది. పదేళ్ల కాలంలో అద్దె, పార్కింగ్, మెయింటెనెన్స్ ఛార్జీలు కలుపుకొని మొత్తం రూ.1,000 కోట్లకు పైగానే యాపిల్ ఇండియా చెల్లించనుంది. ఎంబసీ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఈ భవనాన్ని అద్దెకు తీసుకుందని ‘ప్రోప్‌స్టాక్’ (Propstack) అనే డేటా అనలిటిక్స్ సంస్థ వెల్లడించింది. ఆ బిల్డింగ్ పేరు ‘ఎంబసీ జెనీత్’ అని, ఈ బిల్డింగ్‌లో కార్ పార్కింగ్ సహా పలు ఫ్లోర్లను ఆపిల్ లీజ్‌కు తీసుకుందని వివరించింది.

 

ఈ లీజ్ ఒప్పందం 2025 ఏప్రిల్ 3 నుంచి మొదలై 120 నెలల (10 సంవత్సరాలు) వరకు కొనసాగుతుందని వివరించింది. ఒప్పందంలో భాగంగా ఎంబసీ జెనీత్ భవనంలో 9 ఫోర్లను యాపిల్ ఇండియా లీజుకు తీసుకుంది. 5వ ఫ్లోర్ నుంచి 13వ ఫ్లోర్ వరకు ఈ కంపెనీకి చెందుతాయి. ఈ బిల్డింగ్ లీజు కోసం యాపిల్ కంపెనీ ఇప్పటికే రూ.31.57 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించింది. భారతదేశంలో ఆపిల్ కంపెనీ వ్యాపార విస్తరణకు ఈ పరిణామం ఒక కీలక అడుగుగా కనిపిస్తోంది. కాగా, ప్రోప్‌స్టాక్ సంస్థ.. లీజింగ్ లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సమీక్షిస్తుంది.

Read Also- Putin – Modi: మోదీకి పుతిన్ ఫోన్.. ట్రంప్‌తో భేటీలో ఏం జరిగిందో వెల్లడి

యాపిల్‌ ఇండియా లీజ్‌కు తీసుకున్న ఆఫీస్‌లో ప్రతి చదరపు అడుగుకు నెల అద్దె రూ.235గా నిర్ణయించారు. ప్రతి ఏడాది అద్దెను 4.5 శాతం చొప్పున పెంచనున్నట్లు ఒప్పందంలో నిర్ణయించారు. ఈ పెరుగుదల ప్రకారం చూసుకుంటే 10 ఏళ్ల కాలంలో మొత్తం ఖర్చు రూ.1,000 కోట్లకు పైగానే ఉంటుంది. కాగా, ప్రస్తుతం భారతదేశం నుంచి ఎక్కువ ఫోన్లు ఎగుమతి చేస్తున్న కంపెనీ యాపిల్ కావడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతి చేసింది.

Read Also- DMK – Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇండియా కూటమి వ్యూహం.. అభ్యర్థి ఆయనేనా?

అయితే, యాపిల్ కంపెనీ విస్తరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుతలిగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఖతార్‌లోని దోహాలో జరిగిన ఓ బిజినెస్ సదస్సులో మాట్లాడుతూ, టిమ్ కుక్‌తో (Apple CEO) తనకు కాస్త సమస్య వచ్చిందని, భారతదేశంలో యాపిల్ కంపెనీ విస్తరణను నిలిపివేయాలని చెప్పినట్టు పేర్కొన్నాను. ‘‘నేను నిన్ను అన్ని విధాలా మంచిగా చూసుకుంటున్నాను. కానీ, నువ్వు భారతదేశమంతటా కంపెనీలు నిర్మిస్తున్నావంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నాకు ఇది నచ్చడం లేదు. నువ్వు భారత్‌లో కంపెనీ డెవలప్‌మెంట్ చేపట్టకూడదు అని చెప్పాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అత్యధిక టారిఫ్ వసూలు చేసే దేశాలలో భారత్ ఒకటి అని ఆయన నిందలు వేశారు. భారత మార్కెట్‌లో విక్రయాలు జరపడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు.

కాగా, భారత్‌లో కంపెనీ విస్తరణను యాపిల్ కంపెనీ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలలో కంపెనీ ఇంజినీరింగ్ టీమ్‌లు ఉన్నాయి. బెంగళూరులో అద్దెకు తీసుకున్న ఎంబసీ జెనీత్‌లో లీజ్‌కు తీసుకున్న కొత్త కార్యాలయం, భారత్‌లో తన టెక్నాలజీ స్థాయిని మరింతగా పెంచేందుకు యాపిల్‌కు దోహదపడనుంది.

Just In

01

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్