Viral Video (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Video: ఇదేం పైత్యం.. మామిడి పండ్ల కోసం.. ఇంత కక్కుర్తి అవసరమా?

Viral Video: దేశంలో మామిడి పండ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు. పండ్లకు రారాజుగా పిలిచే మామిడికాయ టేస్ట్ దేనికి ఉండదని మ్యాంగో లవర్స్ చెబుతుంటారు. ఒక్క సమ్మర్ లో మాత్రమే లభించే ఈ మామిడి పండ్ల కోసం.. చాలా మంది ఏడాది పొడవున ఎదురుచూస్తుంటారు. కాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మామిడి పండ్ల సాగు జరుగుతుంటుంది. ప్రాంతాన్ని బట్టి అవి విభిన్నమైన రుచిని సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటిని ఒక చోట చేరుస్తూ యూపీలో మ్యాంగో ఫెస్టివల్ (Mango Festival)ను నిర్వహించారు. అయితే అక్కడ జనం చేతివాటం చూపించడంతో అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ మారాయి.

వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో తాజాగా మ్యాంగో ఫెస్టివల్ ను నిర్వహించారు. జులై 4, 5, 6 తేదీల్లో ఈ ఫెస్టివల్ జరిగింది. అవధ్ శిల్ప్‌గ్రామ్‌లో నిర్వహించిన ఈ ఫెస్టివల్‌లో దాదాపు 600 రకాల మామిడిలు ప్రదర్శనకు ఉంచారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) జులై 4న ఈ మ్యాంగో ఫెస్టివల్ ను ప్రారంభించడం గమనార్హం. అయితే ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఉంచిన విభిన్నమైన మామిడి పండ్లను చూసేందుకు పెద్ద ఎత్తున మ్యాంగో లవర్స్ (Mango Lovers) తరలివచ్చారు. తమకు నచ్చిన రకం మామిడి పండ్లను కొనుగోలు చేసి.. ఎంచెక్కా ఆరగించారు.

నవ్వుతూనే దోచేస్తూ..
అయితే చివరి రోజు అయిన జులై 6వ తేదీన కూడా పెద్ద ఎత్తున మ్యాంగో లవర్స్ ఫెస్టివల్ కు వచ్చారు. ఈ క్రమంలో కొందరు తమ చేతివాటం ప్రదర్శించారు. ప్రదర్శనకు ఉంచిన మామిడి పండ్లను జేబుల్లో నింపుకొని పారిపోయారు. కొందరు మామిడి పండ్లను దుప్పట్లు, చీరల్లో, బ్యాగ్ లలో నింపుకుంటున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు వారు ఎంతో ఆనందిస్తూ మామిడి పండ్లను దోచేస్తుండటం.. వీడియోలో రికార్డ్ అయ్యింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో పరిస్థితిని నియంత్రించడం కష్టసాధ్యంగా మారిందని నిర్వహకులు పేర్కొన్నారు.

Also Read: MM Keeravani: సినీ పరిశ్రమకు బిగ్ షాక్.. కీరవాణి ఇంట తీవ్ర విషాదం

నెటిజన్లు ఫైర్
మ్యాంగో ఫెస్టివల్ కొందరు బాధ్యతారహితంగా వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలా అనాగరికంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మ్యాంగో లవర్స్ కోసం.. దేశం నలుమూలల నుంచి భిన్నమైన మామిడి పండ్లు తీసుకొచ్చిన నిర్వాహకులకు ఇదేనా మీరు ఇచ్చే బహుమతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రదర్శనకు ఉంచిన మామిడి పండ్లను.. ఉచితంగా పంచుతున్నారని భావించి పొరపాటున కొందరు దొంగతనం చేసినట్లు తెలుస్తోంది.

Also Read This: Srikalahasti: శ్రీకాళహస్తిలో గ్యాంగ్ వార్.. నడిరోడ్డుపై చచ్చేలా కొట్టుకున్న రెండు గ్రూపులు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!