Viral News: అయ్య బాబోయ్.. బైక్‌లోకి దూరిన పాము!
Viral News (Image Source: Twitter)
Viral News, లేటెస్ట్ న్యూస్

Viral News: అయ్య బాబోయ్.. బైక్‌లోకి దూరిన పాము.. జస్ట్ మిస్ లేదంటే!

Viral News: భూమి మీద అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ఒకటి. అవి ఒకసారి కాటు వేసాయంటే ఆరడుగుల మనిషి సైతం అమాంతం కుప్పకూలి పోవాల్సిందే. అందుకే చాలా మంది., సర్పాలను తెగ భయపడిపోతుంటారు. అవి కంటికి కనిపించగానే ఆమాడ దూరం పరిగెడతారు. అలాంటిది నిత్యం మనం ఉపయోగించే బైక్ లోకి పాము దూరితే ఇంకెమైనా ఉందా? కానీ మధ్యప్రదేశ్ లో ఇదే జరిగింది. ఓ స్టూడెంట్ బైక్ లో అత్యంత విషపూరితమైన పాము దూరగా.. కొద్దిలో అతడు తప్పించుకున్నాడు.

అసలేం జరిగిందంటే
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బాధితుడు బి.ఎ. రెండో సంవత్సరం చదువుతున్నాడు. తన రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ రిపైర్ కావడంతో దగ్గరలోని మెకానిక్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో మెకానిక్ మోటర్ బైక్ ట్యాంకర్ కింద చూడగా అక్కడ ప్రమాదకరమైన రస్సెల్ వైపర్ (Russell Viper) చుట్టుకొని కనిపించింది. దీంతో అవాక్కైన మెకానిక్.. పక్కనే నిలబడ్డ విద్యార్థిని సైతం వెనక్కి లాగాడు. అయితే పాము ఉన్న బైక్ ను దాదాపు రెండు గంటలపాటు స్టూడెంట్ నడిపినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అది అతడిపై దాడి చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read: Sarcoma Signs: ఈ 5 లక్షణాలు మీలో ఉన్నాయా? సార్కోమా క్యాన్సర్ కావొచ్చు!

వెచ్చదనం కోసమే..
బైక్ నుంచి సర్పాన్ని బయటకి తీసేందుకు స్థానికంగా ఉండే పాముల పట్టే వ్యక్తికి మెకానిక్ సమాచారం ఇచ్చాడు. దీంతో పాములు పట్టే వ్యక్తి అకిల్ బాబా (Akhil Baba) ఘటనా స్థలానికి చేరుకొని చాలా జాగ్రత్తగా విష సర్పాన్ని బయటకు తీసుకువచ్చాడు. అనంతరం అకిల్ బాబా మీడియాతో మాట్లాడుతూ ‘భారతదేశంలో అత్యంత విషపూరితమైన పాముల్లో రస్సెల్స్ వైపర్ ఒకటి. వాతావరణం చల్లగా ఉండటంతో వెచ్చదనం కోసం ఆ పాము ట్యాంక్ చుట్టుకొని ఉండొచ్చు. బైక్ ను ఎక్కడైన చెట్ల కింద పార్క్ చేసినప్పుడు ఇది జరిగి ఉండవచ్చు. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే నిమిషాల్లో రక్తం గడ్డకట్టడం ప్రారంభిస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే అది మరణానికి కూడా దారితీయవచ్చు’ అని చెప్పుకొచ్చాడు.

Also Read This: Janhvi Kapoor: ఛీ ఛీ వాడు మనిషేనా.. చాలా సిగ్గుచేటు.. జాన్వీ తీవ్ర ఆగ్రహం!

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..