Temple ( Image Source: Twitter)
Viral

Fingerprint Astrology: చావు గురించి ముందే చెప్పే ఆలయం ఉందని మీకు తెలుసా.. ఎక్కడ ఉందంటే?

 Fingerprint Astrology: రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికి ఉండదు? చెప్పండి? చిలక జోస్యం, జాతక శాస్త్రం, నాడీ జ్యోతిష్యం. ఇలా ఎన్నో రకాల పద్ధతులు మన భవిష్యత్తును ఊహించడానికి ప్రయత్నిస్తాయి. కొందరు దీన్ని “కేవలం మూఢనమ్మకం” అని నవ్వుతూ కొట్టిపారేస్తే, మరికొందరు గట్టిగా నమ్మి, జీవిత నిర్ణయాలకు ఈ జోస్యాలను ఆధారం చేసుకుంటారు. “మన తలరాత చెప్పేవాడి జాతకం ముందు చూడు, వాడి జీవితం సాఫీగా ఉంటేనే మన భవిష్యత్తు చెప్పమను” అంటూ సరదాగా జోకులు వేసేవాళ్లూ ఉన్నారు. కానీ, తమిళనాడులోని ఒక పురాతన ఆలయం మీ భవిష్యత్తును మాత్రమే కాదు, మీరు ఎప్పుడు, ఎలా చనిపోతారనే ఆశ్చర్యకర విషయాన్ని కూడా చెప్పగలదని ప్రచారం. అయితే, ఆ ఆలయం ఎక్కడ ఉంది? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ? దాని ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Mysterious Temple: ఏడాదిలో 15 రోజులు నీరు అదృశ్యం.. ఈ ఆలయం తెలంగాణలో ఎక్కడ ఉందో తెలుసా?

ఆ గుడి  చావు గురించి ముందే చెబుతోందా? 

తమిళనాడులోని శివగంగై జిల్లాలో వేతీశ్వరన్ కోయిల్ అనే పవిత్ర ఆలయం ఉంది. ఇక్కడ శివుడిని వైద్యనాథస్వామిగా ఆరాధిస్తారు, ఆయన రోగాలను నయం చేసే దేవుడిగా పేరుగాంచాడు. అయితే, ఈ ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది ఇక్కడి నాడీ జ్యోతిష్యం. పురాణాల ప్రకారం, వేల ఏళ్ళ క్రితం అగస్త్య మహర్షి తన అద్భుతమైన దివ్య శక్తితో భూమిపై జన్మించే ప్రతి మనిషి జీవిత వివరాలను.. గతం, వర్తమానం, భవిష్యత్తు, తాళపత్రాలపై రాసి భద్రపరిచారట. ఈ తాళపత్రాలను నాడీ గ్రంథాలు అంటారు.  2000 సంవత్సరాల పురాతనమైన ఈ గ్రంథాలు ఈ ఆలయంలో ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయని నమ్ముతారు.

Also Read: Baba Vanga 2026 Predictions: అతి భయంకరంగా 2026 కాలజ్ఞానం.. ఈ సారి కరోనాకి మించిన రోజులు వస్తాయా?

నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చిన వారి నుండి మొదట వేలిముద్ర తీసుకుంటారు. పురుషులైతే కుడిచేతి బొటనవేలు, స్త్రీలైతే ఎడమచేతి బొటనవేలు ముద్రను సేకరిస్తారు. ఎందుకంటే, ప్రతి వ్యక్తి వేలిముద్ర చాలా ప్రత్యేకమైనది, ఒకరిది ఒకరికి సరిపోలదు. ఈ వేలిముద్ర ఆధారంగా, మీ జీవిత కథ రాసిన తాళపత్రాన్ని వెతకడం మొదలవుతుంది. వేలిముద్రలను 108 రకాలుగా వర్గీకరించి, సంబంధిత తాళపత్రాల సమూహాన్ని ఎంచుకుంటారు.

Also Read: Health Tips: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? అయితే, ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు