Israel USA: ఇజ్రాయెల్ కోసం అమెరికా భారీ ఖర్చు.. లెక్క ఇదిగో!
THAAD USA
Viral News, లేటెస్ట్ న్యూస్

Israel USA: వామ్మో.. ఇజ్రాయెల్ కోసం అమెరికా ఎంత ఖర్చుపెట్టిందో బయటపడింది

Israel USA: అణు బాంబుల తయారీకి ఒక్క అడుగు దూరంలో నిలిచిన ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇజ్రాయెల్ భీకర్ దాడులు చేసిన విషయం తెలిసింది. అణు కేంద్రాలను ధ్వంసం చేయడంతో పాటు, కీలకమైన శాస్త్రవేత్తలను కూడా చంపేసింది. ఈ పరిణామం ఇరుదేశాల మధ్య 12 రోజుల యుద్ధానికి దారితీసింది. అయితే, ఇజ్రాయెల్‌కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా కూడా యుద్ధంలోకి అడుగుపెట్టింది. బంకర్ బస్టర్ బాంబులు ఉపయోగించి ఇరాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. అంతేకాదు, ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ రక్షణ కోసం భారీగా ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్స్‌, యాంటీ-మిసైల్ వ్యవస్థలను మోహరించింది. మిత్రదేశమైన ఇజ్రాయెల్ రక్షణను మరింత పటిష్టం చేసేందుకు తన యాంటీ-మిసైల్ వ్యవస్థ అయిన ‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్’లో (THAAD) 15 నుంచి 20 శాతం వరకు అమెరికా వినియోగించింది. 60-80 వరకు ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులను వాడినట్టు ‘మిలిటరీ వాచ్ మ్యాగజైన్’ కథనం పేర్కొంది.

Read this- Newton 4th law: ‘న్యూటన్ ఫోర్త్‌ లా’ ఇదేనట.. క్రేజీ పోస్ట్ వైరల్

థాడ్ ఇంటర్‌సెప్టర్‌ను ఒక్కసారి ప్రయోగించడానికి 12-15 మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుంది, కాబట్టి 12 రోజుల యుద్ధంలో అమెరికాకు 810 మిలియన్ డాలర్ల నుంచి 1.215 బిలియన్ డాలర్ల (రూ.10 వేల కోట్లు పైమాటే) వరకు ఖర్చు అయ్యి ఉంటుందని ‘మిలిటరీ వాచ్ మ్యాగజైన్’ లెక్కగట్టింది. ఇరాన్ దాడుల నుంచి నష్టాన్ని తగ్గించగలిగిందని పేర్కొంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే దీర్ఘకాలిక యుద్ధాలలో దేశ రక్షణ, ఎదురు దాడులకు అసమాన రీతిలో వ్యయాలు అవుతాయని, ఆ వ్యయాలు స్థిరంగా ఉండకపోవచ్చని విశ్లేషించింది. 2024లోనే ఇజ్రాయెల్‌లో థాడ్ వ్యవస్థను అమెరికా తిరిగి మోహరించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.

Read this- Shefali Jariwala: పాపం.. సింగర్ షెఫాలికి ఆ వ్యాధి ఉంది.. స్వయంగా ఆమె చెప్పారు

ఇరాన్ క్షిపణుల వర్షం

అణు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశంపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌లోని పలు నగరాలపై దాడులతో విరుచుకుపడింది. ఇందుకోసం గదర్, ఎమాద్, ఖైబార్ షెకాన్, ఫట్టా-1 హైపర్‌సోనిక్ మిసైల్ వంటి శక్తిమంతమైన క్షిపణులను గురిపెట్టింది. ఇవి అధునాతన క్షిపణులు కావడంతో థాడ్ వ్యవస్థ కూడా అడ్డుకోలేకపోయింది. యుద్ధంలో ఉన్న మిత్రదేశాలకు మద్దతివ్వడం అంటే సైనిక పోరాటానికి సంసిద్ధంగా ఉన్నట్టే లెక్క. యుద్ధ విస్తరించడానికి ప్రభావితం చేసినట్టే అవుతుంది. అయినప్పటికీ ఎన్నో సవాళ్లను కాదని ఇజ్రాయెల్‌కు థాడ్ వ్యవస్థను అమెరికా మోహరించింది.

ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలు శక్తిమంతమైన బాంబులు, అణు వార్‌హెడ్‌లను తయారు చేసుకుంటున్న నేపథ్యంలో, మీడియం, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసే సామర్థ్యంతో థాడ్ వ్యవస్థను అమెరికా తయారు చేసింది. అయితే, ప్రతి ఏడాది 50-60 వరకు మాత్రమే థాడ్ ఇంటర్‌సెప్టర్‌లను ఉత్పత్తి చేస్తోంది. దీనిర్థం, ఇజ్రాయెన్-ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధంలో ఉపయోగించిన ఇంటర్‌సెప్టర్లను తయారు చేయడానికి కొన్నేళ్ల సమయం పట్టనుంది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరుదేశాలు సయోధ్యకు అంగీకరించిన విషయం తెలిసిందే.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు