Viral News: రెజ్యూమ్‌లో (Resume/CV) వివరాలు పూర్తి స్థాయిలో, స్పష్టంగా, ఆకర్షణీయంగా పొందుపరచడం ఉద్యోగ అభ్యర్థికి చాలా ముఖ్యం. ఎందుకంటే, జాబ్ కోరుకునే వ్యక్తి తనను తాను కంపెనీకి పరిచయం చేసుకునే విధానం అది. కంపెనీకి ఉపయోగపడే తనలోని శక్తిసామర్థ్యాలను కచ్చితంగా పొందుపరచాలి. పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, విద్యార్హతలు, సాధించిన మార్కులు, వర్క్ ఎక్స్‌పీరియన్స్, నైపుణ్యాలు, టెక్నికల్ పరిజ్ఞానం, తెలిసిన భాషలు ఇలా చాలా వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. కానీ, ఓ యువకుడు ఉద్యోగ అన్వేషణలో కొంగొత్త విధానంలో రెజ్యూమ్ రూపొందించాడు. అది పరిశీలించిన కంపెనీ యజమానుల నుంచి నెటిజన్ల వరకు చాలా మంది షాక్‌కు గురవుతున్నారు. చాలామంది పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.
Real Also- Dating app Scam: వృద్ధుడిపై కన్నేసిన యువకులు.. ఇలా ఉన్నారేంట్రా.. ఇంకెవరూ దొరకలేదా?
రెజ్యూమ్‌లో సగమే ప్రింటింగ్
సోషల్ మీడియాలో వైరల్ అయిన రెజ్యూమ్‌లో కొంత భాగం మాత్రమే ప్రింట్ అయ్యింది. మిగతా భాగమంతా లాక్ చేసి కనిపిస్తోంది. ‘‘ నా పూర్తి సామర్థ్యాలు, అర్హతలు తెలుసుకోవడానికి రెజ్యూమ్‌ను అన్‌లాక్ చేయాలంటే నన్ను నియమించుకోండి’’ అని అంటూ సదరు యువకుడు క్యాప్షన్ ఇచ్చాడు. ఫొటోలో తన ముఖం కూడా సగమే ముద్రించి కనిపించింది. జీవితంలో సాధించాలనుకుంటున్న లక్ష్యాలు మినహా ఏమీ కనిపించలేదు. రెడిట్‌లో షేర్ చేసిన ఈ రెజ్యూమ్ గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారిపోయింది. రెజ్యూమ్‌లో ముద్రించి కనిపించిన లక్ష్యాలలో ‘‘మీ కంపెనీలో భాగస్వామిని అవుతాను. మీ కంపెనీలో నా నైపుణ్యాలను మెరుగుపరచుకొని మరింత నాలడ్జ్ పొందగలను. మీ కంపెనీతో పాటు నా కెరీర్‌ను మెరుగుపరచుకోవాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
Read this- Dating app Scam: వృద్ధుడిపై కన్నేసిన యువకులు.. ఇలా ఉన్నారేంట్రా.. ఇంకెవరూ దొరకలేదా?
అర్హతలు, అనుభవాన్ని తెలియజేయకుండా రెజ్యూమ్ ప్రిపేర్ చేయడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ, “0.01 శాతం అవకాశం ఉన్న జాబ్ ఆఫర్‌ను మీకు ఈ-మెయిల్ చేయబోతున్నారు’’ అంటూ ఓ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి స్పందిస్తూ, “రెజ్యూమ్‌లో మిగతా భాగాన్ని ముద్రించడానికి ముందు ప్రింటర్ ఆగిపోయిందో ఏమో” అంటూ నవ్వుల పూయించాడు. మరికొందరైతే ఇంకాస్త హాస్యాన్ని జోడించారు. “ఇదేదో పెద్ద తెలివైన విషయం అని నేను ఒప్పుకోను’’ అని ఒకతను, “నేను గనుక రిక్రూటర్‌ను అయితే, నేను 100 శాతం ఇంటర్వ్యూకి పిలుస్తాను. మీకు జాబ్ ఇవ్వవచ్చు. అది కూడా ఏమీ ప్రశ్నించకుండా నేరుగా ఆఫీస్‌లో కూర్చొబెట్టి పనిచేయించాలి’’ అని పేర్కొన్నారు.