Puri Jagannath temple (Image Source: Twitter And AI)
Viral

Puri Jagannath temple: పూరి క్షేత్రంలో అద్భుతం.. అందరూ చూస్తుండగా వింత ఘటన..

Puri Jagannath temple: దేశంలోని ప్రముఖ సుప్రసిద్ధ దేవాలయాల్లో పూరిలోని శ్రీ జగన్నాథుని క్షేత్రం (Puri Jagannath temple) ఒకటి. ఈ గుడిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. ఈ గుడి ఎన్నో వింతలు, విశేషాలకు నెలవుగా చెబుతుంటారు. దేశంలోని అసాధారణమైన దేవాలయాల్లో జగన్నాథుడి గుడి ముందు వరుసలో ఉంటుంది. ఆ గుడికి సంబంధించిన ఘనతలు నిత్యం వార్తల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా పూరి జగన్నాథుడి ఆలయం వద్ద ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఏం జరిగిందంటే!
ఒడిశాలోని పూరి జగన్నాథ క్షేత్రంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గుడి గోపరంపై ఉండే శ్రీచక్రాన్ని భగవంతుడికి దిక్సూచిగా భక్తులు భావిస్తారు. నిత్యం రెప రెపలాడే ఆ జెండాకు నమస్కరించుకొని పరవశించి పోతుంటారు. అటువంచి ఆ జెండాను ఓ గద్ద ఎగరేసుకొని పోయింది. అంతేకాదు ఆ పవిత్ర జెండాను నోటికి కరుచుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది.

అందరూ చూస్తుండగానే..
పూరీ ఆలయంపై ఉండే పతీత పావన జెండాను.. ఆలయ నిర్వాహకులు నిత్యం మారుస్తూ ఉంటారు. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా జరుగుతుంది. ఆదివారం సాయంత్రం జెండాను మారుస్తుండగా భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి ఓ గద్ద వచ్చి ఆ జెండాను తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ దృశ్యాలను చూసి పూరి భక్తులు మైమరిచిపోయారు. గరుత్మంతుడు స్వయంగా ఇలా గద్ద రూపంలో వచ్చారని మురిసిపోయారు.

Also Read: Viral Video: సమ్మర్ స్పెషల్.. క్లాస్ రూమ్ లకు ఆవు పేడ.. వీడియో వైరల్

నెట్టింట వీడియో వైరల్
పూరీ క్షేత్రం చుట్టూ గద్ద ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు భక్తులు తమ సెల్ ఫోన్ లో బంధించడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ రయ్.. రయ్.. అంటూ దూసుకుపోయే గద్ద ఇలా భక్తి భావంతో ప్రదక్షిణలు చేయడం తామెప్పుడు చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే గరుత్ముంతుడు గద్ద రూపంలో వచ్చారేమోనని అభిప్రాయపడుతున్నారు. మెుత్తం ఈ వీడియో అటు నార్త్ నుంచి సౌత్ వరకూ ప్రతీ ఒక్కరిని ఆకర్షిస్తోంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!