Viral Video (Image Source: Twitter)
Viral

Viral Video: సమ్మర్ స్పెషల్.. క్లాస్ రూమ్ లకు ఆవు పేడ.. వీడియో వైరల్

Viral Video: భారత సనాతన ధర్మంలో ఆవుకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. గోమాత అంటూ హిందువులు ఆవుకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. సాదుజీవి అయిన ఈ ఆవు ఇచ్చే పాలతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో ఆవు పేడ వల్ల కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇందులో భాగంగానే మన పూర్వికులు ఆవు పేడను ఇంటి ముందు అందంగా అలకడం ద్వారా హానికారకమైన బ్యాక్టీరియాలు, వైరస్ లకు చెక్ పెట్టేవారు. అయితే తాజాగా ఓ ప్రిన్సిపల్.. కళాశాల గోడలకు ఆవు పేడ పూస్తూ వైరల్ గా మారింది.

ఇంతకీ ఎక్కడంటే?
ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపల్ అనూహ్యం నిర్ణయం తీసుకున్నారు. తరగతి గదులకు ఆవు పేడ పూయించి.. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఉన్నత విద్యావంతురాలైన ప్రిన్సిపల్ ప్రత్యూష్ వత్సల స్వయంగా తన చేతులతో ఆవు పేడ గోడలకు రాయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆవు పేడ ప్రయోజనాల గురించి నేటి తరం విద్యార్థులకు ఆమె తెలియజేస్తున్నారని ప్రశంసిస్తున్నారు.

రీసెర్చ్ లో భాగంగా..
తరగతి గదులకు ఇలా ఆవు పేడను పూయడం రీసెర్చ్ భాగంగా ప్రిన్సిపల్ చేశారు. ఒక ప్రాసెస్ భాగంగా గోడలకు పూత పూసామని వారం రోజుల తర్వాత దాని ఫలితాలను వెల్లడిస్తానని ప్రిన్సిపల్ ప్రత్యూష్ వత్సల అన్నారు. వేసవి తాపం నుంచి తరగతిలోని విద్యార్థులు బయటపడేందుకు దీనిని చేసినట్లు తెలిపారు. ఇలా గోడలకు పూత పూయడం ద్వారా తరగతి గదిలో చల్లటి వాతావరణ ఏర్పడుతుందని ఆమె తెలిపారు.

Also Read: Twist in Aghori Story: అఘోరీకి బిగ్ షాక్.. తెరపైకి రహస్య భార్య.. పాపం వర్షిణి!

ప్రాజెక్ట్ పేరు ఏంటంటే?
ఈ ప్రాజెక్ట్ కు ‘స్టడీ ఆఫ్ హీట్ స్ట్రెస్ కంట్రోల్ బై యూజింగ్ ట్రెడిషనల్ ఇండియన్ నాలెడ్జ్’ పేరు పెట్టినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. త్వరలో తరగతి గది రూపు రేఖలు మారిపోనున్నట్లు చెప్పారు. ఈ కళాశాలలో కొత్తరకమైన టీచింగ్ విధానాన్ని విద్యార్థులకు అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కళాశాలను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు మీద 1965లో స్థాపించారు. ఢిల్లీలోని అశోక్ విహార్ లో ఈ కళాశాల ఉంది. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు