Tsunami Warning
Viral, లేటెస్ట్ న్యూస్

Tsunami Warning: సునామీ భయంతో తీర ప్రాంతాల్లో కలకలం.. ప్లాట్‌లోనే ఉండిపోయిన మహిళ

Tsunami Warning: రష్యా తూర్పు ప్రాంతంలో సంభవించిన 8.7 తీవ్రత కలిగిన భూకంపం అనేక దేశాలను వణికిస్తోంది. సునామీ హెచ్చరికలు (Tsunami Warning) జారీ కావడంతో అమెరికా, జపాన్‌తో పాటు పలు దేశాల్లోని తీర ప్రాంతాల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సునామీ అలలను ఇప్పటికే గుర్తించారు. ఈ సమాచారం తెలిసి ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే, అమెరికాలోని హవాయి రాష్ట్రం హొనలులుకు చెందిన షెల్బీ బ్లాక్‌బర్న్ అనే మహిళ మాత్రం తన నివాస ప్రాంతాన్ని వీడి వెళ్లేందుకు నిరాకరించింది. ఇందుకు గల కారణాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘టిక్‌టాక్’ వేదికగా ఆమె షేర్ చేసింది.

ఆమె ఎక్కడ ఉంది?

‘వైకికీ బీచ్ నుంచి సునామీ ముప్పు హెచ్చరిక’ అనే టైటిల్‌తో షెల్బీ బ్లాక్‌బర్న్ ఈ వీడియోను షేర్ చేసింది. తన పరిస్థితిని వివరించింది. బీచ్‌కు తాను కొన్ని బ్లాక్స్ దూరంలో ఉన్నానని, కన్డోలో 13వ అంతస్థులో ఉన్నానని ఆమె వివరించింది. ‘‘నా దగ్గర కారు లేదు. ఒకవేళ కారు ఉన్నా చేసేదేమీ లేదు. ఎందుకంటే, బీచ్ వదిలిపోతున్నవాళ్ల వాహనాలతో రోడ్డు పూర్తిగా నిండిపోయింది. నేను వెళ్లాల్సిన అత్యంత సమీప సునామీ సేఫ్ జోన్‌కు చేరుకోవడానికి 15-20 నిమిషాలపాటు నడవాల్సి ఉంటుంది. అది కూడా నా పసిబిడ్డతో (కూతురు) కలిసి నడవాల్సి ఉంటుంది” అని షెల్బీ తన బాధను వివరించింది. అందుకే ఇక్కడే ఉండటం ఉత్తమమని నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోందని ఆమె చెప్పింది. ఈ విధంగా ఫ్లాట్లలో ఉండిపోయింది తాను మాత్రమే కాదని, ఇతర అపార్టుమెంట్‌లోని కొంతమంది ఎత్తైన అంతస్తులలోనే ఉండాలని నిర్ణయించుకున్నారని ఆమె చెప్పింది. ఇక వైకికీ రోడ్లపై నెలకొన్న తీవ్ర ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియోలను కూడా ఆమె షేర్ చేసింది. ఇక్కడ నెలకొన్న పరిస్థితులను తాను తేలికగా తీసుకోవడం లేదు, కానీ వెళ్లే పరిస్థితి లేదని ఆమె చెప్పారు. తన కూతురితో ఒంటరిగా అటువైపు వెళ్లడాన్ని తలచుకుంటేనే ప్రమాదకరంగా అనిపిస్తోందని షెల్బీ వివరించింది.

Read Also- Rangareddy Murder Case: రాష్ట్రంలో ఘోరం.. ఫేమస్ కావాలని అక్కను చంపిన తమ్ముడు!

నా వల్ల కాదు..

సునామీ రక్షిత ప్రాంతానికి చేరుకోవాలంటే తాను ఉన్న ప్రదేశం నుంచి 15-20 నిమిషాలు నడవాల్సి ఉంటుందని, చంటిబిడ్డను ఎత్తుకొని అంతదూరం తాను నడవలేనని, తన వల్ల కాదని చెప్పింది. అందుకే తన ఫ్లాట్‌లోనే ఉండిపోయానని వీడియోలో ఆమె వివరించింది. నిజానికి రష్యా‌లోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో 8.7 తీవ్రత కలిగిన భూకంపం సంభవించిన తర్వాత, హవాయితో పాటు పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో, ఓహూ, వైకికీ, అలా వే హార్బర్ ప్రాంతాల్లోని ప్రజలు, పర్యాటకులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు పరుగులు పెట్టారు. దీంతో, రోడ్డుపై తీవ్రమైన ట్రాఫిక్‌ ఏర్పడి చాలామంది ఇరుక్కుపోయారు. ఇంతటి ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ షెల్బీ బ్లాక్‌బర్న్ అక్కడే ఉండిపోయింది. ఆమె ఉంటున్న నివాసం వైకికీ బీచ్ సమీపంలో ఉంది. హవాయిలో ఇది అత్యంత పాపులర్ పర్యాటక ప్రాంతం. అయితే, ప్రస్తుతం ఈ ప్రాంతంలోని స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయాందోళనలతో ఈ ప్రదేశాన్ని విడిచిపెడుతున్నారు.

ఇదిలావుంచితే, రష్యాలోని కురిల్ దీవులు, జపాన్‌లోని హొక్కైడో తీరాలను సునామీ తాకినట్లు గుర్తించారు. రష్యా తీరానికి సమీపంలో సంభవించిన 8.8 తీవ్రత కలిగిన భూకంపం కారణంగా అమెరికాలోని అలాస్కా, హవాయి, న్యూజిలాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Read Also- Warangal Task Force: బోగస్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాల సృష్టి.. 15 మంది కేటుగాళ్ల అరెస్ట్!

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్