Viral Video: ప్రస్తుతం, సోషల్ మీడియాను ( Social Media ) చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు విపరీతంగా వాడుతున్నారు. పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్ చూస్తూ ఉండిపోతున్నారు. ఒకరని కాకుండా ఒకటో తరగతి పిల్లల నుంచి పెద్దలు వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేయడం మొదలు పెట్టారు. మరి ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక కొందరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని లని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ కాలేజీకి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూశాక .. వామ్మో, ఈ అమ్మాయి ఏంట్రా ఇలా చేసింది అని అనకుండా ఉండరు. ఇంతకీ, ఆమె ఏం చేసిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Venu swamy : ఏమైంది టాలీవుడ్ కు? నిన్న బన్నీ, నేడు మిల్కీ బాయ్.. వేణు స్వామి శాపమేనా?
ఇద్దరూ అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉండగా ఒక అమ్మాయికి ఫోన్ కాల్ వచ్చింది. అయితే, చాలా సేపటి నుంచి ఫోన్ మాట్లాడటంతో .. అది గమనించిన టీచర్ అ ఆమ్మాయి దగ్గరికి వెళ్లి ఫోన్ తీసుకుంది. అలా వెళ్తున్న టీచర్ పై ఒక్కసారిగా చెప్పు తీసుకుని విద్యార్థిని దాడి చేసింది. అంతటితో ఆగకుండా చెంపమీద కూడా కొట్టింది. అలా వారిద్దరూ కొట్టుకున్న వీడియోను కాలేజీ విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది.
Also Read: Mahesh Babu: హీరో మహేష్ బాబుకు బిగ్ షాక్.. నెక్స్ట్ లిస్ట్ పెద్దదేనా? ఈడీ వెరీ స్పీడ్ బాస్..
దీనిపై, నెటిజన్స్ రక రకాలుగా స్పందిస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి క్లాస్ కి వెళ్ళకుండా బయట కాల్స్ మాట్లాడుతుంది. సీరియస్ గా వాళ్ల బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ మ్యాటర్ గురించి ఏడుస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది. ఆ సమయంలో టీచర్ గారు వెళ్ళి ఫోన్ తీసుకోవడంతో ఆ అమ్మాయికి కోపం వచ్చి ఇలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు