Fruit: స్టార్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఎంపిక. అందుకే మన ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారాన్ని ఎక్కువగా చేర్చుకుంటాం. ఈ క్రమంలో మీ డైట్‌లో ఒక అద్భుతమైన పండును చేర్చుకోవాలనుకుంటే, స్టార్ ఫ్రూట్ మీ ఆరోగ్యానికి ఒక సూపర్ ఎంపిక.
ఈ పండు పసుపు రంగులోకి మారినప్పుడు తియ్యగా, ఆకుపచ్చగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది. ఇది రుచికి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలకు కూడా అద్భుతం.స్టార్ ఫ్రూట్‌లో పోషకాలుస్టార్ ఫ్రూట్ ఒక పోషకాల గని. దీనిలో ఇందులో విటమిన్ సి, B2, B6, B9, ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్, క్యాల్షియం, సోడియం, కాపర్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ పండును డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు పొందొచ్చు.
Also Read: Jogulamba Gadwal: ఇంకెన్నాళ్లీ యూరియా కష్టాలు.. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న మహిళలు
స్టార్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు ఇవే..
కొలెస్ట్రాల్ నియంత్రణ: స్టార్ ఫ్రూట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తంలోని కొవ్వు అణువులను తొలగిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి ఇది ఒక గొప్ప ఎంపిక.
బరువు తగ్గింపు: ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఆరోగ్య నిపుణులు సిఫారసు చేసే ఆహారం.
Also Read: Trolls on South Film Industry: సౌత్ హీరోలపై సోషల్ మీడియా పోస్ట్ వైరల్.. వారికి అంత గర్వం పనికిరాదు!
గుండె ఆరోగ్యం: రక్తపోటును నియంత్రించే గుణాలతో, స్టార్ ఫ్రూట్ గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుదల: ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
రోగనిరోధక శక్తి: విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Also Read: Coolie Collections: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సౌత్ సినిమా.. ఆ కలెక్షన్స్ మామూలుగా లేవుగా..
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.