Viral Video: కారులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా సైడ్ మిర్రర్ పక్కన ఉన్న చిన్న గ్యాప్ నుంచి ఏదో కదిలినట్లు కనిపిస్తే ఎవరికైనా షాక్ తగులుతుంది. అది పాము అయితే భయంతో పాటు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకంగా ఆ పాము విషపూరితమా కాదా తెలియని పరిస్థితుల్లో డ్రైవర్‌కి స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది.
తమిళనాడులోని నమక్కల్ – సేలమ్ రోడ్డుపై ఇలాంటి సన్నివేశమే రోడ్డుపై ప్రయాణిస్తున్న వారిని గుబులు పెట్టించింది. కారు సైడ్ మిర్రర్ లోపల దాగి ఉన్న పామును డ్రైవర్ గమనించగా, ఆ సంఘటనకు సంబంధించిన వీడియోను X (ట్విటర్)లో షేర్ చేశారు. ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు.. ప్రత్యేకంగా వర్షాకాలం, చలి కాలంలో అప్రమత్తంగా ఉండాలని భద్రతా సూచనలు కూడా జారీ చేశారు.
సైడ్ మిర్రర్ నుంచి బయటపడిన పాము .. షాకింగ్ విజువల్స్ వైరల్
వైరల్ వీడియోలో ” కార్ సైడ్ మిర్రర్ లో ఒక చిన్న పాము బయటకు వచ్చింది. పాము ఇరుక్కున్నట్లుగా కదులుతూ ఉండటంతో, పక్కనే స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యంతో వెనక్కి తగ్గారు. డ్రైవర్ వెంటనే కారు ఆపి ప్రమాదం జరగకుండా చూసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత అధికారులు, వన్యప్రాణి నిపుణులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ.. ఎక్కువ సేపు కార్ పార్క్ చేసినప్పుడు లేదా అడవి ప్రాంతాల దగ్గర వాహనాలు నిలిపినప్పుడు, బోనెట్, వీల్ ఆర్చ్‌లు, మిర్రర్లు వంటి చోట్లను తప్పకుండా చెక్ చేయాలని సూచించారు. చలి కాలంలో పాములు, బల్లి, ఎలుకలు వంటి చిన్న జంతువులు వాహనాల్లో వేడి కోసం దాక్కోవడం సాధారణం.
వీడియో చూసిన నెటిజన్స్..షాక్ అయి కామెంట్స్ చేస్తున్నారు. “ ఇది బ్లైండ్ స్పాట్ కాదు… బైట్ స్పాట్,” అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా.. “ ఒక్కసారి చూసినప్పుడు బైకర్లను ఫ్రైట్ చేసేందుకు టాయ్ స్నేక్ పెట్టాడనుకున్నా,” అని మరో యూజర్ సరదాగా కామెంట్ చేశాడు.

