Subhanshu Sukhla, Kamna
Viral, లేటెస్ట్ న్యూస్

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా ఏం చదివారు?, ఇంట్లో ఎలా ఉంటారో తెలుసా?

Shubhanshu Shukla: యాక్సియం-4 మిషన్ ద్వారా ప్రయాణించిన భారత వ్యోమగామి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) గురువారం అడుగుపెట్టారు. చాన్నాళ్ల తర్వాత ఒక భారతీయ వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో యావత్ దేశం గర్వపడుతోంది. దేశమంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఆయన కుటుంబ సభ్యులతో ఆనందంతో మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో శుభాంశు శుక్లా-భార్య కామ్నా మధ్య ఆప్యాయత, వారిద్దరి లవ్ స్టోరీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లాంచ్ కావడానికి కొన్ని గంటల ముందు కామ్నాకు శుక్లా ఒక భావోద్వేగ లేఖ రాశారు. ‘‘నా ప్రయాణంలో నీ పాత్ర దేనితోనూ భర్తీ చేయలేనిది కామ్మా’’ అంటూ ప్రేమను పంచుకున్నారు. కామ్నా రిప్లై ఇస్తూ, ‘‘మిమ్మల్ని చూసి గర్వపడుతున్నానండీ’’ అని పేర్కొన్నారు. దీనిని బట్టి ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కామ్నా.. ఒక డెంటిస్ట్
శుభాంశు శుక్లా-కామ్నా పరిచయం దశాబ్దాల క్రితమే పరిచయం జరిగింది. లక్నోలోని ఓ ప్రైమరీ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉంది. శుభాశు క్లాస్ రూమ్‌లో చాలా సైలెంట్‌గా ఉండేవారని, దేశాన్ని ప్రేరణగా తీసుకొని ఎదిగారని కామ్నా గుర్తుచేసుకున్నారు. యాక్సియం-4 ప్రారంభానికి ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు పంచుకున్నారు. దేశానికి సేవలు అందించే క్రమంలో జీవితంలోని చాలా ముఖ్యమైన క్షణాలను శుక్లా కోల్పోయారని వివరించారు. సవాళ్లను తట్టుకున్నారని పేర్కొన్నారు. ‘‘మాకు బాబు పుట్టినప్పుడు ఒక తండ్రిగా శుక్లా ఆ కీలక క్షణాలను కోల్పోయారు. అవి నాకు చాలా బాధ కలిగిస్తాయి. ఏదేమైనా లక్ష్యం విషయంలో శుక్లా గురితప్పలేదు. మహాభారతంలో అర్జునుడిలా శుభాంశు శుక్లాకు దృఢ సంకల్పం ఉంది. నిర్దిష్టమైన ఏకాభిప్రాయం, ఖచ్చితత్వంతో ఉంటారు’’ అని కామ్మా వివరించారు.

Read this- Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి సందేశం ఇదే

ఇంట్లో క్రమశిక్షణ, ప్రశాంతత
ఇంట్లో ఉన్నప్పుడు శుక్లా చాలా ప్రశాంతంగా, క్రమ శిక్షణతో ఉంటూ స్ఫూర్తిగా ఉంటారని కామ్నా వివరించారు. నాన్-ఫిక్షన్, ఫిట్‌నెస్‌ను ఇష్టపడతారని చెప్పారు. ఇక, ఇంట్లో తండ్రి-కొడుకుల అల్లరిని ఇష్టపడుతుంటానని చెప్పారు. సమస్యకు పరిష్కారంపై సహజ దృష్టితో ఆలోచిస్తారని వివరించారు. యుద్ధ విమానాల నుంచి అంతరిక్ష క్యాప్సూల్‌లో ప్రయాణం వరకు భయంబెరుకు లేని పరివర్తననులో ఆయనలో చూశానని కామ్నా చెప్పారు. శుభాంశు శుక్లా తన వైఖరిని ఎప్పుడూ వీడరని చెప్పారు. ఎన్ని సవాళ్లైనా ఎదురుకానీ ప్రయాణాన్ని ఆపకూడదని చెబుతుంటారని వివరించారు.

Read this- Kubera Movie: కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్.. గాయాలపాలైన ప్రేక్షకులు

శుక్లా ఏం చదివారు?
శుభాంశు శుక్లా చదువు లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్‌లో మొదలైంది. 1998లో కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన కెరీర్‌ మలుపు తిరిగిందని చెప్పాలి. ఎందుకంటే, దేశానికి సేవ చేయాలనే బలమైన సంకల్పం ఆ సమయంలో పురుడు పోసుకుంది. దృఢ సంకల్పాన్ని పూనుకున్న ఆయన, తన కుటుంబానికి తెలియజేయకుండా యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షకు అప్లికేషన్ పెట్టారు. ఎంతో సంక్లిష్టంగా ఉండే ఆ పరీక్షలో పాసయ్యారు. 2005లో ఎన్‌డీఏ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా ఆయన చదివారు. ఆ తర్వాత, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమానం నడపంలో ట్రైనింగ్ తీసుకున్నారు. 2006లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు నడిపేందుకు అధికారికంగా నియమితులయ్యాయి.

సుదీర్ఘ విమానయాన అనుభవం
శుభాంశు శుక్లా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో టెస్ట్ పైలట్‌గా విశిష్టమైన అనుభవాన్ని పొందారు. ఎన్నో యుద్ధ విమానాలు నడిపారు. దాదాపు 2,000 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉంది. రకరకాల మోడల్ విమానాలను ఆయన నడిపారు. విమానాలు నడపడంలో ఖచ్చితత్వం, క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్రో భవిష్యత్‌లో భవిష్యత్‌లో చేపట్టబోయే ‘గగన్‌యాన్ మిషన్’ కోసం శుక్లాను ఎంపిక చేశారు. 2019లో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములలో ఆయన కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రం, బెంగళూరులోని భారత వ్యోమగామి శిక్షణా కేంద్రంలో సంక్లిష్టమైన వ్యోమగామి ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?