Subhanshu Shukla
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి సందేశం ఇదే

Shubhanshu Shukla: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన టెస్ట్ పైలట్‌, భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో (Shubhanshu Shukla) పాటు మరో ముగ్గురు వ్యోమగాములు రోదసిలో ప్రయాణిస్తున్న యాక్సియం-4 మిషన్‌ ఇవాళ (గురువారం) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో (ఐఎస్ఎస్) అనుసంధానం కానుంది. డాకింగ్ అనే పిలిచే కీలకమైన ఈ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా గురువారం మాట్లాడారు. గగనయానం ఒక అద్భుతమని చెప్పారు. భారరహిత స్థితిలో నడవడం ఒక చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నానని ఆయన వివరించారు. ఈ మేరకు లైవ్‌కాల్‌లో నలుగురు వ్యోమగాములు తమ అనుభవాలను వెల్లడించారు. రోదసియానంలో తనది చిన్న అడుగే కావచ్చు, కానీ భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఇదొక గొప్ప ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఐఎస్ఎస్‌లో కుదిరినంత ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నానని, తన అనుభవాలను అందరితో పంచుకోవడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పారు.

Read this- Anasuya Bharadwaj:యాంకర్ అనసూయ ఫోన్ ట్యాపింగ్.. రహస్యాలు మొత్తం బయటకు వస్తాయా?

అందరికీ నమస్కారం
అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానని అన్నారు. తన సహచర వ్యోమగాములతో కలిసి ఈ స్థితిలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందని శుభాంశు శుక్లా చెప్పారు. ఇదొక గొప్ప అనుభుతి అని అభివర్ణించిన ఆయన, 30 రోజుల క్వారంటైన్‌ తర్వాత ఐఎస్ఎస్‌కు చేరుకోబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. గగనయానంలో తనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. జాయ్ అనే ఒక హంస (పిల్ల) బొమ్మను కూడా తీసుకెళుతున్నామని తెలిపారు. భారతీయ సంప్రదాయంలో హంస విజ్ఞానానికి సంకేతం అని శుభాంశు శుక్లా ప్రస్తావించారు.

Read this- Chief Engineer Harassment: మహిళా ఉద్యోగులపై చీఫ్ ఇంజనీర్ లైంగిక వేధింపులు.. సీతక్క వద్దకు ఇష్యూ!

పిల్లాడిలా నేర్చుకుంటున్నాను
‘‘భారరహిత స్థితిలో నడకను అలవాటు చేసుకుంటున్నాను. అంతరిక్షంలో ఏవిధంగా నడవాలి?, ఏ ఆహారం తినాలి? అనే అంశాలను ఒక చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. అంతరిక్షంలో గడిపే ప్రతి ఒక్క క్షణాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై మన జాతీయజెండా ఉంది. మువ్వన్నెల జాతీయ పతాకం చూసిన ప్రతిసారీ ఈ గగనయానంలో నేనే ఒంటరిని కాదు. కోట్లాది మంది భారతీయులు తోడుగా ఉన్నారనే ధైర్యం వస్తోంది’’ అని శుభాంశు శుక్లా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సుమారుగా 15 నిమిషాల పాటు లైవ్‌కాల్‌లో ఆయన మాట్లాడారు. కాగా, భారత కాలమానం ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు యాక్సియం-4 మిషన్ ప్రయోగ జరిగింది. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాముల టీమ్ ఐఎస్ఎష్ బయలుదేరింది, గురువారం సాయంత్రం 4:30 డాకింగ్ ప్రక్రియ జరగనుంది. డాకింగ్ ప్రక్రియ ద్వారా వాహన నౌక ఐఎస్ఎస్‌తో అనుసంధానం అవుతుంది. అనంతరం వ్యోమగాముల బృందం ఐఎస్ఎస్‌లోకి ప్రవేశించి 14 రోజుల పాటు పరిశోధనలు నిర్వహించనుంది.

Read this- Lakshmi Narasimha Swamy Temple: మహిమాన్విత క్షేత్రం.. హేమాచల మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది