Asia Cup 2025
Viral, లేటెస్ట్ న్యూస్

Shreyas Iyer: ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపికలో ట్విస్ట్!.. స్టార్ బ్యాటర్ దూరం!!

Shreyas Iyer: ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసిన టీమిండియా ఆసియా కప్-2025 కోసం సమాయత్తం అవుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగబోతున్న భారత్ జట్టు ఎంపిక అతిత్వరలోనే జరగనుంది. ఆగస్టు 19న ముంబైలో టీమ్ ఎంపిక ఉండనుంది. అయితే, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కకపోవచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా మరో స్టార్ ఆటగాడి పేరు వినిపిస్తోంది. ఐపీఎల్‌లో, ఇటు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) కూడా ఆసియా కప్‌లో చోటు దక్కే అవకాశం లేదంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో ఆవేదనకు గురైన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి తీవ్ర నిరాశ తప్పదని తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను డిసెంబర్ 2023లో ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాలో అతడికి పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. అరకొరగా అవకాశాలు లభిస్తున్నాయి. ఆడిన మ్యాచ్‌ల్లో కూడా ఎక్కువగా వన్డేలు ఉన్నాయి. టీ20 క్రికెట్‌తో పెద్దగా టచ్‌లో లేకపోవడంతో, ఇదే ఫార్మాట్‌లో జరగబోతున్న ఆసియా కప్-2025కు అతడిని ఎంపిక చేసే అవకాశం లేదంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

గిల్, జైస్వాల్‌కు కూడా కష్టమే

డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా కప్ బరిలోకి దిగుతున్న భారత్ జట్టు 9వ సారి కప్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 2023లో శ్రీలంకను కోలంబోలో జరిగిన ఫైనల్‌లో 10 వికెట్ల తేడాతో ఓడించి టీమిండియా టైటిల్‌ను ముద్దాడింది. ఇక ప్రస్తుత ఆసియా కప్ కోసం భారత జట్టు ఆగస్టు 19న ఎంపిక చేయనున్నారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. టీ20ల్లో ప్రస్తుత ఓపెనింగ్ జోడీ అయిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మలపై టీమ్ మేనేజ్‌మెంట్ విశ్వాసంతో ఉంది. కాబట్టి, వారిద్దరూ జట్టులో ఖరారైనట్టుగా తెలుస్తోంది. దీంతో, టెస్టు ఫార్మాట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ చోటుదక్కే అవకాశం కనిపించడం లేదు. వీరిద్దరూ చివరిసారిగా ఏడాదిక్రితం భారత్ తరఫున టీ20 మ్యాచ్‌ ఆడారు. అందుకే, వీరి ఎంపిక విషయంలో సెలక్టర్లు ఆసక్తిగా లేరని సమాచారం.

Read Also- Murder in Saudi Arabia: సౌదీలో హత్య.. 26 ఏళ్లకు భారత్‌లో దొరికిన నిందితుడు

కాగా, ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. మిగతా బ్యాటర్లందరి కంటే చాలా మెరుగ్గా రాణించాడు. జైస్వాల్ కూడా ఇంగ్లండ్ పర్యటన‌లో చక్కటి ప్రదర్శన చేశాడు. 5 టెస్ట్‌ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో గిల్ 754 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. 75.40 సగటుతో రన్స్ సాధించాడు. అందులో నాలుగు శతకాలు కూడా ఉన్నాయి. దీంతో జులై 2025కు ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్’డు కూడా గిల్‌కు దక్కింది.

ఇక, యశస్వి జైస్వాల్ 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 411 పరుగులు సాధించాడు. అతడి సగటు 41.10 పరుగులగా ఉంది. రెండు శతకాలు, రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో అత్యధిక స్కోరు 118 పరుగులుగా ఉంది. ఇంత బాగా రాణించిన గిల్, జైస్వాల్ చోటుదక్కకపోతే చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంటుంది.

Read Also- Trump on Tariffs: అలా చేయకూడదేమో.. భారత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..