Viral News: ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. కాశీపూర్ అనే గ్రామానికి చెందిన ఓ వివాహితను, ఇద్దరు పురుషుల్ని ఒకే విద్యుత్ స్థంభానికి కట్టేసి దారుణాతి దారుణంగా కొట్టారు. ఆ ఇద్దరు మగ వ్యక్తులతో కలిసి సదరు మహిళ దగ్గరలోనే ఉన్న జషిపూర్ వారాంతపు సంతకు వెళ్లింది. ముగ్గురూ కలిసి బైక్‌పై సంతకు వెళ్లారు. అయితే, వారు తిరిగొస్తుండగా గమనించిన మహిళ తరపు బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘర్షణకు దిగారు. కలిసి వెళ్లిన ఇద్దరు పురుషుల్లో ఒకరితో ఆమెకు శారీరక సంబంధం ఉందని, అందుకే వారితో కలిసి సంతకు వెళ్లిందంటూ మహిళ భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో, గ్రామస్తులు ఆ ముగ్గురినీ కరెంట్ స్థంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టి శిక్షించారు. కర్రలతో కూడా దాడి చేశారు. బాధిత మహిళకు కొన్నాళ్ల క్రితం పెళ్లి అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Read Also- Hanumakonda Task Force: హనుమకొండలో టాస్క్ ఫోర్స్ దాడులు.. భారీ మొత్తంలో నిషేధ గుట్కా స్వాధీనం
ఎఫైర్ ఉందని అనుమానం
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. గ్రామస్తులు పదేపదే మహిళను, ఇద్దరు పురుషులను కొట్టడం వీడియోలో కనిపించింది. చేతులు, కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత మహిళతో కలిసి మార్కెట్‌కు వెళ్లిన ఇద్దరు పురుషుల్లో ఒకరు ఆమె భర్త కుటుంబానికి చాలా సన్నిహితుడైన వ్యక్తి అని, వరుసగా ఆమెకు సోదరుడు లాంటివాడని తెలిపారు. అయినప్పటికీ, మహిళకు, అతడికి మధ్య శారీరక సంబంధం ఉన్నట్టు కుటుంబ సభ్యులు, మరికొందరు అనుమానిస్తున్నారని వివరించారు. కరెంట్ స్థంభానికి కట్టేసిన ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు.
Read Also- Modi on Nepal: నేపాల్ మన క్లోజ్ ఫ్రెండ్.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
దాడులు చేయడం చట్టవిరుద్ధం
అక్రమ సంబంధాలపై అనుమానాలు అనేక ఘర్షణలకు, హింసాత్మక ఘటనలకు దారితీయడం ఇటీవలి కాలంలో నిత్యకృత్యమయ్యాయి. అనుమానం పెరిగి చాలామంది నేరస్థుల్లా ప్రవర్తిస్తున్నారు. అంతకీ అనుమానం ఉంటే, శాంతియుతంగా పరిష్కరించుకునే ఓపిక లేకపోతే, న్యాయ మార్గాల్లో స్పందిస్తే బావుంటుంది. కానీ, అలా కూడా కాకుండా దాడులకు తెగబడుతున్నారు. ఇటు మహిళలపై, అటు పురుషులపైనా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా హింసకు పాల్పడటం అర్థరహితంగా మారుతోంది. ఇలా కాకుండా వ్యక్తిగత జీవితాల్లో విభేదాలు తలెత్తితే శాంతియుత మార్గంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని మానసిక వికాస నిపుణులు సూచిస్తున్నారు. పెద్దలు, పంచాయితీలు అంటూ మానవత్వం మరిచిపోయి శిక్షలు విధించడం సరికాదని అంటున్నారు. ఈ విధంగా వ్యవహరించడం చట్ట విరుద్ధం మాత్రమే కాదని, మానవ హక్కుల ఉల్లంఘన కిందకు కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Read Also- Jupally Krishna Rao: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. అవసరమైతే ఆయుధాలు ఇస్తాం.. ప్రభుత్వం కీలక ప్రకటన
