Shefali Jariwala: దాదాపుగా 23 ఏళ్ల క్రితం ‘కాంటా లగా’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో దేశాన్ని ఒక ఊపుఊపిన ప్రముఖ పాప్ సింగర్, టీవీ నటి షెఫాలి జరివాలా (42) (Shefali Jariwala) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. జూన్ 27న రాత్రి 10-11 గంటల మధ్య ఆమె అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి గుర్తించిన వెంటనే షెఫాలిని ఆసుపత్రికి తరలించారు. కానీ, హాస్పిటల్‌కు చేరుకునే సరికే ఆమె ఊపిరిపోయింది. దీంతో, వైద్యులు నిస్సహాయులుగా మిగిలారు. షెఫాలి సడెన్ హార్ట్‌ఎటాక్‌కు గురైనట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె అకాల మరణం చాలామంది సినీ పరిశ్రమ ప్రముఖులను, ఫ్యాన్స్‌ను పెద్ద షాక్‌కు గురిచేసింది. షెఫాలి గుండెపోటుతో చనిపోయినట్టుగా మీడియా కథనాలు వచ్చినప్పటికీ, అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో సందేహాలు పుట్టుకొస్తున్నాయి.
Read also- Shefali Jariwala: పాపం.. సింగర్ షెఫాలికి ఆ వ్యాధి ఉంది.. స్వయంగా ఆమె చెప్పారు
ఆ మందులే కారణమా?
షెఫాలి జరివాలా యాంటీ-ఏజింగ్ (వృద్ధాప్య నివారణ) మందులు బాగా వాడేవారని, గుండె దెబ్బతినడానికి ఇదే కారణం కావొచ్చని, మొత్తంగా యాంటీ-ఏజింగ్ డ్రగ్స్ మృతికి కారణమవ్వొచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. షెఫాలి కుటుంబ సభ్యులు కూడా మృతికి గల కారణాలను వెల్లడించకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. భర్త పరాగ్ త్యాగి మీడియాతో మాట్లాడుతూ, ఆమె మరణాన్ని ఒక నాటకీయ పరిణామంగా మార్చదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. షెఫాలి మృతికి గల కారణాలపై మాట్లాడబోనని ఆయన అన్నారు. దీంతో, పోస్టుమార్టం రిపోర్టులో మృతికి గల కారణాలు ఏం చెప్పారనేది మరింత అనుమానాన్ని రేకెత్తిస్తోంది.
మృతికి నిర్దిష్టమైన కారణం ఏంటో తెలియకపోవడంతో ముంబై పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా నమోదు చేశారు. పోస్టుమార్టం జరిగింది, కానీ మృతికి దారితీసిన కారణాన్ని రిజర్వ్ చేసినట్టు ఓ పోలీసు అధికారి చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, షెఫాలిది సహజ మరణం అనిపిస్తోందని, ఈ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని సదరు అధికారి పేర్కొన్నారు.
Read this- India Vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఖరారు!
యాంటీ-ఏజింగ్ డ్రగ్స్ ఎంతకాలం వాడారు?
షెఫాలి గత ఏడెనిమిది ఏళ్లపాటు యాంటీ-ఏజింగ్ మందులు వాడినట్టుగా తెలుస్తోంది. కాగా, స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల ఇంజెక్షన్లు గుండె పనితీరును దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీలో మార్పులు వస్తాయని, అరిథ్మియాను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఈ ప్రభావాలు కొన్ని సందర్భాల్లో, అకస్మాత్తుగా గుండెపోటుకు దారితీయవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా, ఖాళీ కడుపుతో లేదా వేరే ఇతర మందులతో కలిపి ఇలాంటి మందులు తీసుకున్నప్పుడు గుండెపోటుకు దారితీస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
షెఫాలి ఉపవాసం ఉన్న రోజే?
షెఫాలి యాంటీ-ఏజింగ్ మందులు, వాటికి సంబంధించిన ఇంజెక్షన్ తీసుకున్న రోజున ఉపవాసం ఉన్నట్టుగా పలు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో, బీపీ తగ్గి, శరీరంలో వణుకు వచ్చి అపస్మారక స్థితికి దారితీసినట్టు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివిధ రకాల మందులను షెఫాలి ఇంటి నుంచి ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. యాంటీ-ఏజింగ్ వయల్స్, విటమిన్ సప్లిమెంట్స్, గ్యాస్ట్రిక్ మాత్రలు ఉన్నాయని తెలుస్తోంది. షెఫాలి మృతి వెనుక మందుల వాడకం ఉందనే అనుమానాలకు ఈ పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి.