Sanju Samson
Viral, లేటెస్ట్ న్యూస్

Sanju Samson: ఫ్రాంచైజీ మారిన శాంసన్.. రికార్డులు బ్రేక్ చేసిన ధర

Sanju Samson: టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) ఫ్రాంచైజీ మారాడు. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ మార్చేశాడా ఏంటి? అని తెగ కంగారు పడిపోకండి. ఎందుకంటేm శాంసన్ ఫ్రాంచైజీ మారింది కేరళ ప్రీమియర్ లీగ్‌లో (KPL). ఈ ఏడాది జరగనున్న రెండవ ఎడిషన్‌కు కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు అతడిని దక్కించుకుంది. రూ.26.80 లక్షలు వెచ్చించి యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో, కేరళ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా శాంసన్ రికార్డులు సృష్టించాడు.

గతేడాది అనుభవలేమి ఆటగాళ్లతో ఇబ్బందిపడిన కొచ్చి బ్లూటైగర్స్ ఈ ఏడాది ఎలాగైనా పుంజుకోవాలనే ఏకైక లక్ష్యంతో శాంసన్‌పై భారీ మొత్తం వెచ్చించింది. వాస్తవానికి ఒక జట్టు గరిష్ఠంగా రూ.50 లక్షలు మాత్రమే ఆటగాళ్ల కొనుగోలుకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయినప్పటికీ, దాదాపు సగానికి పైగా సొమ్మును ఒక్క శాంసన్‌పైనే యాజమాన్యం ధారపోసింది. కాగా, కేపీఎల్ రెండవ సీజన్ ఆగస్టు 21న మొదలు కానుంది. సెప్టెంబర్ 6 వరకు టోర్నమెంట్ జరుగుతుంది. కేపీఎల్ సమయంలో టీమిండియాకు ఎలాంటి టీ20 షెడ్యూల్ లేదు. అయితే, ఆగస్టు 28 నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీకి శాంసన్స్‌ను ఎంపిక చేస్తే మాత్రం, కేపీఎల్ సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండదు.

Read also- Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి కొత్త ట్రిక్.. పొట్ట మటుమాయం!

శాంసన్‌ను రాజస్థాన్ వదిలేస్తుందా?

జూన్‌తో ముగిసిన ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL) సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే, గాయాల కారణంగా కీలక మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. మొత్తం 5 మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరుకోకపోవడానికి సంజూ శాంసన్ జట్టుకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణంగా ఉంది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్‌ మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ఇతర ఫ్రాంచైజీలతో ‘ట్రేడ్ ఆఫ్’ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.

ఆ ఆరుగురి పేర్లను రాజస్థాన్ రాయల్స్ జట్టు బహిరంగంగా ప్రకటించక పోయినప్పటికీ, ఈ జాబితాలో ఆ జట్టుకు చాలాకాలంగా కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్ కూడా ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా, శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ వదులుకోవాలని నిర్ణయించుకుందో లేదో తెలియదు. కానీ, శాంసన్ స్థానానని ధ్రువ్ జురెల్‌తో భర్తీ చేయించే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపర్ ఆప్షన్‌గా జురెల్ కనిపిస్తున్నాడు. ఇక, ఐపీఎల్ ఫ్రాంచైజీలను పరిశీలిస్తే సామర్థ్యం ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ అవసరమున్న జట్లు రెండు కనిపిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఉంది. క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్‌లపై కోల్‌కతా నమ్మకం పెట్టుకునే అవకాశం లేదు.

Read Also- Earth: భూభ్రమణంలో అస్సలు ఊహించని మార్పు.. ఏం జరగబోతోంది?

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?