rinku singh
Viral, లేటెస్ట్ న్యూస్

Rinku Singh Engagement: పొలిటీషియన్‌తో క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చిత్తార్థం

Rinku Singh Engagement: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ఎంపీ ప్రియా సరోజ్‌తో (Priya Saroj) వివాహ నిశ్చిత్తార్థం (Rinku Singh Engagement) జరిగింది. ఆదివారం లక్నో నగరంలో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెట్, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రియా, రింకూ పరస్పరం ఎంగేజ్‌మెంట్ రింగులు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రింకూ సింగ్ ఉంగరం తొడుగుతున్న సమయంలో కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్ భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపైనే కళ్లు చమర్చారు. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె కనిపించడం ఆసక్తిగా అనిపించింది. ఇక, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav), బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో (Rajeev Sukla) పాటు పలువురు ప్రముఖులు ఎంగేజ్‌మెంట్ వీడియోలు, ఫొటోల్లో కనిపించారు.

Read this- Revanth Reddy: స్కూల్ బీజేపీలో, కాలేజీ టీడీపీలో, ఉద్యోగం రాహుల్ దగ్గర.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కొన్ని నెలల క్రితమే ఇద్దరి పెళ్లి  సంబంధం కుదిరిందని ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ (Tufani Saroj) వెల్లడించారు. సమాజ్ వాదీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తుఫానీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఇద్దరూ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని పెళ్లికి అంగీకారం తెలిపారని ఆయన వివరించారు. పిల్లలు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆకాంక్షలను తల్లిదండ్రుల వద్ద వ్యక్తం చేశారని, తాము అంగీకరించినట్టు వెల్లడించారు. ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్న తర్వాత నిశ్చితార్థ వేడుకను ఏర్పాటు చేశామన్నారు.

Read this- NBK111: బాలయ్య 111వ సినిమా ఫిక్స్.. దర్శకుడెవరంటే..?

రింకూ ట్రాక్ రికార్డు ఇదే
రింకూ సింగ్ టీమిండియా టీ20 జట్టులో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2023లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 30 టీ20 మ్యాచ్‌లు ఆడి, 22 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు దిగి 46.09 సగటుతో 507 పరుగులు సాధించారు. స్ట్రైక్ రేట్‌ 165.14 గా ఉంది. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌‌లో ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. ఇక, భారత్ తరపున 2 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అద్భుతమైన గణాంకాలను కలిగి ఉన్నాడు. మొత్తం 52 మ్యాచ్‌ల్లో 1,899 పరుగులు సాధించాడు. సగటు 48.69గా, స్ట్రైక్ రేటు 94.8గా ఉన్నాయి. 17 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉన్నాయి.

ఐపీఎల్‌లో గణాంకాలు ఇవే
రింకూ సింగ్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 29.42 సగటు, 153.73 స్ట్రైక్ రేట్‌తో 206 పరుగులు సాధించాడు. ఈ ప్రభావం జట్టుపై కూడా పడింది. 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన ఆ జట్టు 12 పాయింట్లు, -0.305 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పరిమితమైంది.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?