Virat Kohli: ఐపీఎల్ 2025 విన్నర్ గా ఆర్సీబీ నిలిచింది. ప్రస్తుతం, ఏ సోషల్ మీడియా చూసిన ఆర్సీబీ కి సంబందించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో గెలిచింది. ఈజీగా ఛేజ్ చేయాల్సిన మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడం ఏంటని చాలా మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇది పక్కన పెడితే, ఆర్సీబీ కల నెరవేరింది. 18 ఏళ్లు పట్టింది కప్పును అందుకోవడానికి. అయితే, 20 వ ఓవర్లో ఇంకా 4 బాల్స్ మిగిలి ఉండగా.. ఆర్సీబీ గెలుపు ఖాయమవ్వడంతో విరాట్ కోహ్లి చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక గ్రౌండ్ లోనే ఏడ్చాడు. అంటే ఇన్నేళ్ళు ఎంత బాధను మోసి ఉంటే ఒక్కసారిగా కన్నీళ్ళు బయటకు వస్తాయి. ఏదైనా ఈసాలా కప్ నమ్దూ.. అని చెప్పి మరి కొట్టారు.
Also Read: Ram Charan : రామ్ చరణ్ ఆ సమస్యతో చాలా బాధ పడుతున్నాడు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 120 బాల్స్ లో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో గ్రౌండ్ లోకి దిగిన పంజాబ్.. 120 బాల్స్ లో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కేవలం 6 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు గెలిచి కొత్త రికార్డ్ క్రియోట్ చేసింది. ఫైనల్ మ్యాచ్ లో చివరి వరకు పోటా పోటీగా ఆడాయి. ఒకసారి ఆర్సీబీ, మరొకసారి పంజాబ్ రేసులోకి వచ్చాయి. అయితే, చివరికి ఆర్సీబీనే కప్పును ముద్దాడింది.
Also Read: Kamal Haasan: హై కోర్టు తీర్పు తర్వాత.. సంచలన నిర్ణయం తీసుకున్నకమల్ హాసన్.. షాక్ లో ఫ్యాన్స్
ఈ వీడియో పై ఫ్యాన్స్ తో పాటు, నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. అదేంటి ఓడినప్పుడు పెద్దగా రాని కన్నీళ్లు గెలుపు వచ్చినప్పుడు ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి. 17 సంవత్సరాలుగా ప్రతీసారి ఎదురుదెబ్బలు తగులుతూ ఆ టైటిల్ ధిక్కరిస్తూ ఉంటుంటే.. చుట్టూ ఉన్న కొంతమంది అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తూ.. ఉంటే ఆ బాధల నుండి వస్తున్న వేదన కన్నీళ్లల్లా కారిపోయి తన నుండి దూరం వెళ్ళిపోయింది ఇక మళ్ళీ అలాంటి పరిస్థితులు తనకి రాకూడదు అని కోరుకుందాం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్సీబీ కప్పు గెలిచాక వచ్చిన ఎమోషన్ కన్నా.. నాకు వీడియో చూశాక నిజంగా ఏడ్చాను అన్నా.. మా పద్ధెనిమిది ఏళ్ల కల నెరవేరింది భయ్యా అంటూ వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.