Kamal Haasan: కమల్ హాసన్ , మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్ అనే చిత్రం తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో శింబు కూడా నటిస్తున్నారు. రిలీజ్ డేటు దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, శివరాజ్ కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆ రోజు కమల్ ఏం మాట్లాడాడంటే?
కమల్ హాసన్ మాట్లాడుతూ “ నా ఫ్యామిలీ తమిళం అని ఓపెన్ గానే చెప్పేశారు. శివరాజ్ కుమార్ పక్క రాష్ట్రంలో ఉన్నా నా ఫ్యామిలీ మెంబరే. కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది ” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పై కన్నడ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోకపోగా, చేసిన రైటే అన్నట్లు ఉంటే ప్రవర్తించడం ఫ్యాన్స్ కు కోపం ఎక్కువ అయ్యేలా చేసింది. కర్ణాటకలో ఉంటున్న కన్నడ సంఘాలు, ఫ్యాన్స్ నిరసనలు తెలిపారు. థగ్ లైఫ్ మూవీకి సంబందించిన బ్యానర్లను మొత్తం చించేసి, కమల్ దిష్టిబొమ్మలను రోడ్డు మీద దగ్దం చేయడం లాంటివి జరిగాయి.
Also Read: Tamannaah Bhatia: ఆ స్టార్ హీరోతో అడ్డంగా దొరికిపోయిన తమన్నా.. కొత్త బాయ్ ఫ్రెండ్ ను సెట్ చేసుకుందా?
క్షమాపణ చెప్పాలని డిమాండ్?
కమల్ హాసన్ మే 30, 2025లోగా క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయబోమని KFCC హెచ్చరించింది. కమల్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యల పై కర్నాటక హైకోర్టు కూడా సీరియస్ అయింది. అయినా కూడా సారీ చెప్పడానికి కమల్ ముందుకు రాలేదు.
నేను క్షమాపణ చెప్పను?
” నేను మాట్లాడిన దానిలో తప్పేం లేదు.. క్షమాపణ కూడా చెప్పను.. థగ్ లైఫ్ చిత్రాన్ని కర్నాటకలో రిలీజ్ చేయడం లేదు” అని అన్నారు. థగ్ లైఫ్ మూవీ రిలీజ్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మీకు తెలుసా? తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ఎలా చెబుతున్నారు? మీరేమైన చరిత్రకారులా ? అంటూ కమల్ ను హై కోర్టు సూటిగా ప్రశ్నించింది. అలాగే, సారీ చెబితే వివాదం ముగిసిపోతుందిగా అంటూ హైకోర్టు వెల్లడించింది.