Yash Dayal
Viral, లేటెస్ట్ న్యూస్

RCB: పెళ్లి చేసుకుంటానంటూ అమ్మాయిని మోసం చేసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్!

RCB: ఐపీఎల్ సీజన్-18 ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోని కీలక ఆటగాడు, స్టార్ పేసర్ యష్ దయాల్‌పై (Yash Dayal) ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేశాడంటూ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువత ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి ఆన్‌లైన్ ఫిర్యాదుల పోర్టల్ ‘ఐజీఆర్ఎస్’ ద్వారా కంప్లైంట్ ఇచ్చింది. గత ఐదేళ్లుగా యష్ దయాల్‌‌తో తాను రిలేషన్‌లో ఉన్నానని చెప్పింది. శారీరకంగా, మానసికంగా తాను వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఫిర్యాదు సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. ‘‘గత ఐదేళ్లుగా యష్ దయాల్‌తో రిలేషన్‌లో ఉన్నాను. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. నమ్మించి నన్ను తప్పుదోవ పట్టించాడు. భావోద్వేగపరంగా, మానసికంగా, శారీరకంగా నన్ను దోపిడీకి గురిచేశాడు. తన కుటుంబ సభ్యులకు కోడలిగా కూడా పరిచయం చేశాడు. అందుకే, పూర్తిగా నమ్మకం కలిగింది.” అని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.

Read this- Bollywood Heros: చీరలు కట్టిన బాలీవుడ్ హీరోస్.. పాలు పితుకుతున్న అక్షయ్ కుమార్.. వీడియో వైరల్

తామిద్దరం రిలేషన్‌ సమయంలో యష్ దయాల్‌కు మానసికంగా, ఆర్థికంగా అండగా నిలిచానని ఆమె చెప్పింది. అయితే, ఇతర మహిళలతో కూడా అతడు ఈ తరహా సంబంధాలు పెట్టుకున్నట్టు గుర్తించానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 2025 జూన్ 14న ఉమెన్స్ హెల్ప్‌లైన్ నంబర్ 181కి ఫోన్ చేశానని, కానీ, పోలీస్ స్టేషన్ స్థాయిలో ఈ విషయం ముందుకు సాగలేదని ఆమె వాపోయింది. ఆర్థిక, సామాజిక నిస్సహాయత కారణంగా న్యాయం కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె వివరించింది. ఇద్దరి మధ్య జరిగిన చాటింగులు, స్క్రీన్‌షాట్‌లు, వీడియో కాల్స్, ఫోటోలు వంటి చాలా సాక్ష్యాలు ఉన్నాయని ఆమె పేర్కొంది.

ఈ వ్యవహారంపై సత్వరం, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆమె అభ్యర్థించింది. యష్ దయాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. తన విషయంలోనే కాకుండా, అతడి చేతుల్లో మోసపోయిన అమ్మాయిలు అందరికీ న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ నెల ప్రారంభంలో చారిత్రాత్మక రీతిలో ఐపీఎల్ 2025 టైటిల్ ఆర్సీబీ తొలిసారి గెలిచింది. జట్టు గెలుపులో యష్ దయాల్ కూడా కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. కాగా, దేశవాళి క్రికెట్‌లో ఉత్తర ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీమిండియా తరపున ఇంతవరకు ఆడలేదు. జట్టులోకి అరంగేట్రం చేయలేదు.

Read this- Pakistan: పాక్‌‌లో భారీ ఉగ్రదాడి‌.. ప్రకటన విడుదల చేసిన భారత్

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు