Ram Mohan Naidu: కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు.. ఈయన్ను ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం లోక్‌సభ నుంచి టీడీపీ (TDP) ఎంపీగా ఎన్నికైన యంగ్ లీడర్.. ఈ దఫా కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంత్రి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. ఇప్పుడీ పేరు తెలియని వారు కూడా తెలుసుకుంటున్నారు. ఎంతలా అంటే ఎవరీ మంత్రి? ఎక్కడ్నుంచి వచ్చారు? ఇంతకీ ఏ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు? అని గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. మరీ ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Flight Crash) తర్వాత అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రామ్మోహన్ పేరు మార్మోగిపోతోంది. ఓ రేంజిలో ట్రోలింగ్, అంతకుమించి మీమ్స్ ఈయన గురించి తెగ వచ్చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ఇంతలా హాట్ టాపిక్ ఎందుకు అవుతున్నారు? అనే విషయాలు ‘స్వేచ్ఛ’ కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..
Read Also- Flight and Train Accidents: అశ్విని వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేస్తారా?
అసలేం జరిగింది?
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా (Air India) బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం నాడు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మాజీ సీఎం విజయ్ రూపానీ (Vijay Rupani) కూడా కన్నుమూశారు. అయితే.. ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనా స్థలానికి వెళ్లి పర్యవేక్షించారు. ప్రమాదం ఎలా జరిగింది? కారణమేంటి? అని ఆరా తీశారు. విమాన ప్రమాదానికి బాధ్యులను ఉపేక్షించమని, సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. మరోవైపు.. గురువారం రోజు హోం మంత్రి అమిత్ షా (Amit Shah), శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఘటనాస్థలానికి వచ్చారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది.. కానీ, ఆ ఘటనా స్థలంలో పర్యవేక్షించిన వీడియో, ఫొటోలకు మ్యూజిక్ యాడ్ చేసి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఇదే పెద్ద వివాదానికి, అంతకుమించి ట్రోలింగ్స్ (Trollings)కు దారితీసింది. ఆ వీడియో ఏంటి?, ఫొటోలు ఏంటి? ఆ మ్యూజిక్, మల్టిపుల్ కటింగ్స్ ఏంటి? అబ్బో ఆ వీడియో ఎఫెక్ట్ ఏంటి? ఇంతకీ తమరు ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్ చేసుకోవడానికి వెళ్లారా? అంటూ ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో బర్నింగ్ టాపిక్ అయ్యింది.
అవసరమా గురూ!
ఇలాంటి తీవ్రమైన, విషాదకరమైన సందర్భంలో ఇలాంటి వీడియోలు పెట్టడం ఎంతవరకు సబబు? ఇదంతా పద్ధతి కాదు కదా? నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా పౌర విమానయాన శాఖ మంత్రిగా కనీసం బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏమిటి? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. సినిమా షూటింగ్‌కు వెళ్లారా? ప్రమాద ఘటన దగ్గరికి వెళ్లారా? పోయిన పనేంటి? తమరు చేస్తున్నదేంటి..? యో.. చూసుకోబల్లేదా కాస్తయినా అని అని ఆ వీడియోకు నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. సుమారు ఆ వీడియోను 1.7 మిలియన్ల మంది చూడగా.. వేలల్లో కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. అయ్యా.. బిగినింగ్ మినిస్టర్ సెన్సిటివ్ మ్యాటర్స్ వీడియో తీయాలని కనీసం తెలియకుండా మంత్రి ఎలా అయ్యారబ్బా? అని ప్రశ్నిస్తున్నారు. ‘ కొత్త రీల్స్ మినిస్టర్ వచ్చాడు. 240+ మంది మనుషుల చనిపోయి అక్కడ పడి ఉంటే సింపతీ బీజీఎం (BGM) యాడ్ చేసుకుని ఎలివేషన్ రీల్స్ వదులుతున్నావ్ అంటే ఏం మనిషివి రామ్మోహన్ నాయుడు? ప్రభుత్వ విమానాలు లేని దేశానికి విమానయాన శాఖ మంత్రి అంటే ఎంత డమ్మి మంత్రి పదవి వెలగబెడుతున్నావో అర్ధం అవుతుంది. అలాంటి పదవి ఉంటే ఎంత పోతే ఎంత? నీ విమానయాన శాఖ నిర్లక్ష్యంతో 240 మనుషుల ప్రాణాలు తీసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి పరువు నిలుపుకో..’ అని వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు సైతం తిట్టిపోస్తున్నారు. దీన్నే అవకాశంగా మలుచుకొని ఓ రేంజిలో వైసీపీ కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు.
రాజీనామా చేసేయ్!
కాగా, విమాన ప్రమాదంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు. ‘1950లో రైలు పట్టాలు తప్పినప్పుడు నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రీ తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. విమాన ప్రదాన ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలి’ అని డిమాండ్ చేశారు. వాస్తవానికి.. రామ్మోహన్ యువకుడిగా, కొత్తగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయనపై ప్రజల్లో కొన్ని అంచనాలు తప్పకుండా ఉంటాయి. ఇలాంటి విపత్తు సమయాల్లో యంగ్ లీడర్ స్పందన, చర్యలు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. సహజంగానే రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి అవకాశాలను ట్రోలింగ్‌లకు గట్టిగానే వాడుకుంటారు. ఆయన్ను విమర్శించడానికి, పనితీరుపై అనుమానాలు రేకెత్తించడానికి ఈ సంఘటనను వాడుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
Read Also- Black Box: బ్లాక్ బాక్స్ దొరికింది.. విమాన విషాదంలో కీలక పరిణామం
Inspected the crash site along with Hon’ble Home Minister Shri @AmitShah ji and briefed him on the details of the incident. Investigations are underway to determine the cause. pic.twitter.com/bmST0EsQZm
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 12, 2025