Lord Ganesh in Sweater: ఈ ఏడాది ఆరంభంలోనే చలికాలం వణికిస్తోంది. నవంబర్ నెలలోనే డిసెంబర్-జనవరి శీతల వాతావరణాన్ని తలపిస్తోంది. ఉదయం, సాయంత్రం పూట చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో జనాలు బయటకడుగు పెట్టాలంటే జంకుతున్నారు. చాలామంది స్వెటర్లు, జాకెట్లు, హ్యాండ్ బ్లౌజులు ధరించి బయటకు వస్తున్నాయి. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడంతో వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే, ఈ జాగ్రత్తలు మనుషులకు మాత్రమే కాదని, విజ్ఞాలను తొలగించే వినాయకుడికి కూడా అవసరమేనని అంటున్నారు పుణెలోని ఓ చారిత్రాత్మక గణేశాలయం పూజారులు.
పుణెలో చారిత్రాత్మక ఆలయం
చలికాలంలో గణేశుడికి స్వెటర్ అలంకరించే (Lord Ganesha in Sweater) ఈ అరుదైన ఆలయం మహారాష్ట్రలోని (Maharastra) చారిత్రక నగరం పుణెలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న సరస్బాగ్ గణపతికి (Sarasbaug Ganpati) శీతాకాలంలో ప్రత్యేకమైన వస్త్రాధారణ ఇక్కడి ప్రత్యేక సంప్రదాయంగా ఉంది. శీతాకాలంలో గణపతిని వెచ్చగా ఉంచేందుకు ఉన్ని దుస్తులు, స్వెటర్లతో అలంకరిస్తుంటారు. ప్రతి ఏడాది ఇలాగే కొనసాగిస్తుంటారు. స్వెటర్ ధరించిన గణపతికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రతి ఏడాది వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం కూడా వినాయకుడిని స్వెట్టర్ వేసి అలంకరించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Read Also- Hidma Funerals: ఒకే చితిపై హిడ్మా దంపతులు.. అంత్యక్రియలకు పోటెత్తిన ప్రజలు.. ఆదరణ చూసి షాకైన బలగాలు!
పెరిగిన భక్తుల తాకిడి
ప్రత్యేక అలంకరణలో ఉన్న సరస్బాగ్ గణపతిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరిగింది. పుణె నగరంలో వినాయకుడికి సంబంధించిన విశేష దేవాలయాలు, ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటైన సరస్బాగ్‌కు ప్రస్తుతం భక్తుల రద్దీ పెరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వెళ్లి మరీ భక్తులు దర్శించుకుంటున్నారు. చల్లిని వాతావరణం కొనసాగే నెలల్లో ఇక్కడి గణేశుడిని ఉన్ని దుస్తులలో దర్శించుకోవడం ఒక ఆచార సంప్రదాయంగా మారడం భక్తుల రద్దీకి కారణమైంది. ప్రత్యేక శ్రద్ధతో తయారు చేసిన వెచ్చని దుస్తులు, స్వామివారికి సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా, భక్తులకు- దైవానికి మధ్య భక్త అనుబంధాన్ని పెంచుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
Read Also- Sonam Kapoor: రెండో సారి తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్.. ఫొటోలు వైరల్..
ఇక, సరస్బాగ్ ఆలయం ప్రత్యేక విషయానికి వస్తే, సరస్బాగ్ తోట మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. శ్రీమంత్ నానాసాహెబ్ పేష్వా 1750లో ఈ గుడిని నిర్మించారు. అప్పట్లో దీనిని ఒక కొలను మధ్యలో నిర్మించారు. కానీ, కాలక్రమంలో చెరువులో నీరు ఎండిపోవడంతో, దాని చుట్టూ తోటను తీర్చిదిద్దారు. అందుకే, శీతాకాలంలో ఇక్కడ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారిపోతుంది.
पुण्यात आता खरी थंडी आली असं म्हणता येईल, कारण आता सारसबागेतील बाप्पानेसुद्धा कानटोपी आणि स्वेटर घातला!
व्हिडीओ: IGour_punecity pic.twitter.com/6JC5A1wQOw
— बृहन्महाराष्ट्र मराठी मंडळ (@RetweetMarathi) November 18, 2025

