Safety Pin: ప్రస్తుత ఈ-కామర్స్ ప్రపంచంలో ప్రతీది ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటోంది. సబ్బుల నుంచి సెల్ ఫోన్స్ వరకూ.. టీవీల నుంచి ఏసీల దాకా ఇలా గృహోపకరణకు అవసరమైన ప్రతీ వస్తువు అమెజాన్, ప్లిప్ కార్ట్ తదిదర ఈ – కామర్స్ సైట్స్ లో లభిస్తున్నాయి. అయితే నానాటికి ఆన్ లైన్ కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో.. దాని మాటునే కొన్ని మాయాజాలలు సైతం చోటుచేసుకుంటున్నాయి. తక్కువ ధర ఉన్న వస్తువులను ఏకంగా 10 నుంచి 20 రెట్లు ఎక్కువ చేసి విక్రయించేస్తున్నారు. కొబ్బరి పీచు, పీడకలను ఇలా అధిక ధరకు విక్రయించిన సందర్భాలు ఇటీవల చూశాం. అయితే తాజాగా బట్టలకు తగిలించుకునే పిన్నీసు (Safty Pin) సైతం కళ్లు చెదిరే ధరకు ఆన్ లైన్ లో విక్రయానికి పెట్టారు. ఇది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
అసలేం జరిగిందంటే?
ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ప్రాడా (Prada).. మెటల్ సేఫ్టీ పిన్ బ్రూచ్ (Metal Safety Pin Brooch) పేరుతో ఒక పిన్నీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే పిన్నీసు ధరను ఏకంగా రూ.69,000 ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. బట్టలు చిరిగిన చోట పెట్టుకునే పిన్నీసు ధర.. బంగారం కంటే ఎక్కువ ఉండటం చూసి షాకవుతున్నారు. మార్కెట్లో రూ.10-20 కూడా ఉండని ఈ వస్తువును ప్రాడా సంస్థ వందట రెట్లు ఎక్కువ చేసి అమ్మడం చూసి బిత్తరపోతున్నారు.
Also Read: Harish Rao On CM: సీఎం రేవంత్ బ్లాక్ మెయిలర్.. జూబ్లీహిల్స్‌లో బుద్ధి చెప్పాలి.. హరీశ్ రావు ఫైర్
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్..
ఈ సేఫ్టీ పిన్ కు సంబంధించిన ప్రకటన చూసి నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘సాధారణ పిన్ కు ఒక నూలు అల్లి.. రూ.69 వేలు అమ్ముతున్నారేంట్రా బాబు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘మీ కన్నా మా అమ్మమ్మ ఇంకా బాగా పిన్నీసును ముస్తాబు చేస్తుంది’ అని ఓ నెటిజన్ అన్నారు. ‘ధనవంతులు తమ డబ్బుతో ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తున్నారు. మీకు డబ్బును ఖర్చు చేయడం ఎలాగో తెలియకపోతే మాకు ఇవ్వండి. డబ్బును ఏ విధంగా పొదుపుగా ఉపయోగించాలో మాకు తెలుసు’ అని మరొకరు రాసుకొచ్చారు.
