Plane Crash(Image Credit:Twitter)
Viral

Plane crash: ఇంటిపై కుప్పకూలిన విమానం.. భారీగా ఎగసిపడ్డ మంటలు.. వీడియో వైరల్

Plane Crash: అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని బ్రూక్లిన్ పార్క్ సమీపంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయోవా నుంచి మిన్నెసోటాకు వెళ్తున్న ఓ విమానం ఊహించని విధంగా ఇంటిపై కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో, ఆ ఇల్లు క్షణాల్లో దగ్ధమైంది.

ప్రమాద సమయంలో విమానంలో ఎంత మంది ఉన్నారు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. విమానం కూలిన సమయంలో చుట్టుపక్కల వారు భారీ శబ్దం విన్నట్లు తెలిపారు. అనంతరం మంటలు ఆకాశాన్ని అంటడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Also Read: విమానంలా టైకాఫ్ అయ్యే భారీ వంతెన.. మన దేశంలో ఎక్కడుందంటే?

ఈ దుర్ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) దర్యాప్తు ప్రారంభించింది. విమానం కూలడానికి గల కారణాలు, సాంకేతిక లోపాలు లేదా ఇతర అంశాలు ఏవైనా ఉన్నాయా అనే దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొనగా, అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!