Warangal Traffic Police: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చూపించే ఘటన వరంగల్ జిల్లా కాజీపేటలో చోటుచేసుకుంది. ఒక ద్విచక్ర వాహనంపై ఏకంగా 120 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలిసి కాజీపేట చౌరస్తాలో సాధారణ వాహన తనిఖీలు చేపట్టారు.
Also Read: German Content Creater: జర్మనీ నుంచి వచ్చి కుప్పిగంతులు.. తీసుకెళ్లి బొక్కలో వేసిన పోలీసులు!
అదే సమయంలో అటుగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అది ఒకటీ రెండూ కాదు, ఏకంగా 120 ట్రాఫిక్ చలాన్లు కలిగి ఉన్నట్లు తేలింది. ఈ చలాన్ల మొత్తం రూ. 32,165 అని అధికారులు గుర్తించారు. పెండింగ్‌లో ఉన్న భారీ మొత్తంలో చలాన్ల కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాన్ని తక్షణమే స్వాధీనం చేసుకున్నారు. జరిమానా మొత్తం చెల్లిస్తేనే వాహనాన్ని తిరిగి అప్పగిస్తామని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న స్పష్టం చేశారు.