Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) అభిమానులు ఎంతగా ఆరాదిస్తుంటారో ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన పనిలేదు. ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలోనే ఉంటారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి సినీ అభిమానుల హృదయాల్లో చెరుగని ముద్రవేసుకున్న పవన్.. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వస్త్రధారణ విషయంలో హుందాగా నడుచుకుంటున్నారు. జీన్స్ ప్యాంట్లు, టీషర్టు వంటి ట్రెండీ దుస్తులకు దూరమయ్యారు. తెల్లటి ఖాదీ వస్త్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్యాంటు, కుర్తాలో కనిపిస్తున్నారు. రాజకీయాలకు సంబంధించిన బహిరంగ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఈ ఇలాంటి దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. అయితే, రాజకీయ కార్యక్రమాల్లో నిత్యం ఖాదీ దుస్తుల్లో కనిపించే సేనాని, ఆదివారం కాస్త విభిన్నంగా కనిపించారు.
Read this- YSRCP: సింగయ్య నిజంగానే జగన్ కారు కిందపడి చనిపోయాడా.. వీడియోపై బోలెడన్ని డౌట్స్!
పంచెకట్టులో తమిళనాడుకు..
తమిళనాడులోని మధురైలో ‘మురుగ భక్తర్గళ్ మానాడు’ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ వెళ్లారు. తమిళనాడు సాంప్రదాయాన్ని పాటిస్తూ పంచెకట్టులో అక్కడికి వెళ్లారు. పట్టుపంచె, తెల్లటి చొక్కా ధరించి మురుగన్ నేలపై ఆయన అడుగుపెట్టారు. ఆదివారం ఉదయం మధురై చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా, తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం తర్వాత అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో ముఖ్యఅతిథిగా పవన్ పాల్గొంటారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చక్రవర్తి, ఇతర నాయకులు అమర్ ప్రసాద్ రెడ్డి, మధురై జిల్లా అధ్యక్షుడు మారి చక్రవర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ శ్రీనివాసన్, రాధాకృష్ణన్, పలువురు జనసేన నేతలు తదితరులు పవన్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
Read this- Jana Nayakudu: ‘జన నాయకుడు’ ఫస్ట్ రోర్.. చివరి సినిమాలో విజయ్ చేస్తున్న పాత్ర ఇదే!
బీజేపీ నేతలతో భేటీ
ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధురై వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలైతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. తమిళనాడులో బీజేపీ పరిస్థితి, అక్కడి రాజకీయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
Read this- Star Comedian: స్నానం చేయక చేతికి గజ్జి వచ్చిందంటూ.. ఎమోషనల్ అయిన స్టార్ కమెడియన్