Jana Nayakudu
ఎంటర్‌టైన్మెంట్

Jana Nayakudu: ‘జ‌న నాయ‌కుడు’ ఫ‌స్ట్ రోర్.. చివరి సినిమాలో విజయ్ చేస్తున్న పాత్ర ఇదే!

Jana Nayakudu: ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay) న‌టిస్తోన్న చివరి చిత్రం ‘జ‌న నాయ‌కుడు’. ఈ చిత్రాన్ని హిస్టారిక‌ల్ మూవీగా అంద‌రూ అభివ‌ర్ణిస్తున్న విషయం తెలిసిందే. అందుకు కార‌ణం ఆయ‌న న‌టిస్తోన్న చివ‌రి సినిమా ఇది. ద‌ళ‌ప‌తి విజ‌య్ పుట్టినరోజు (జూన్ 22) సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ‘ఫ‌స్ట్ రోర్‌’ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ఇప్పుడీ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంది. ఆయ‌న చివ‌రి చిత్రం కావ‌టంతో ఈ లెజెండరీ నటుడికి వీడ్కోలు పల‌క‌డానికి బీజం చేసిన‌ట్లు గ్లింప్స్‌ను చూస్తుంటే తెలుస్తోంది. 65 సెక‌న్ల నిడివితో వచ్చిన ‘జ‌న నాయ‌కుడు’ ఫ‌స్ట్ రోర్ వీడియోను గ‌మ‌నిస్తే..

Also Read- Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో క్రేజీ స్టార్స్.. రచ్చ చేయడానికి కాంట్రవర్సీ భామలు?

‘నా హృద‌యంలో ఉండే..’ అనే విజయ్ డైలాగ్‌ ఈ గ్లింప్స్‌లో వినిపిస్తుంది. చివరి సినిమాలో విజయ్ తనకి అచ్చొచ్చిన పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లుగా హింట్ ఇచ్చేశారు. పోలీస్ డ్రస్‌లో లాఠీ ప‌ట్టుకుని యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించే ప్ర‌దేశంలో న‌డుస్తూ వ‌స్తున్నారు. ఈ విజువ‌ల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. శ‌క్తి, శాంతి, గంభీరత‌ను క‌ల‌గ‌లిపేలా ఉన్న దళపతి ఎంట్రీ సీన్ ‘జ‌న నాయ‌కుడు’ మూవీ ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి సాధార‌ణ వీడ్కోలు ఇచ్చే సినిమా కాదనే సంకేతాన్ని స్ప‌ష్టంగా ఇస్తోంది. ఫ‌స్ట్ రోర్ వీడియోతో పాటు విడుద‌లైన బ‌ర్త్‌డే పోస్ట‌ర్ మ‌రింతగా మెప్పిస్తోంది. ఈ పోస్టర్‌లో పెద్ద సింహాస‌నం మీద ద‌ళ‌ప‌తి విజ‌య్ ఠీవిగా కూర్చుని చేతిలో క‌త్తిని ప‌ట్టుకుని కనిపిస్తున్నారు. ఇన్‌టెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో కూర్చున్న విజ‌య్ చుట్టూ దట్టమైన పొగ ఆవ‌రించబ‌డి ఉంది. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే ఓ రాజు, యోధుడు, నాయ‌కుడు క‌లిసిన వ్య‌క్తిత్వం ఉన్న పాత్రలో ఆయన నటిస్తున్నాడనేది స్పష్టంగా తెలుస్తోంది.

Also Read- Naga Chaitanya: సమంతను కలిసిన రోజు హగ్ ఇచ్చి అలా చేస్తానంటూ చైతూ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

‘జ‌న‌ నాయ‌కుడు’.. ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తోన్న చివ‌రి చిత్రమని అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి.. ఈ సినిమా చుట్టూ ఓ భావోద్వేగం అలుముకుంది. ఇది కేవ‌లం సినిమా మాత్ర‌మే కాదు, స్టార్‌డ‌మ్‌కి అర్థాన్ని మార్చేసిన హీరో కెరీర్‌కి ఇస్తున్న ముగింపుగా అంతా భావిస్తున్నారు. భావోద్వేగ‌మైన క‌థ‌ల‌ను చెప్ప‌టంలో దిట్ట అయిన హెచ్‌. వినోద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మరోసారి విజయ్ చిత్రానికి అనిరుద్ ర‌విచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజ‌య్‌, అనిరుద్ కాంబోలో ఇది వ‌ర‌కే ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ పాట‌లు వ‌చ్చిన విషయం తెలియంది కాదు. మ‌రోసారి ఈ కాంబో ప్రేక్ష‌కులంద‌రికీ అద్భుత‌మైన అనుభూతిని ఇవ్వ‌బోతుంది.

కె.వి.ఎన్‌. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ కె. నారాయ‌ణ నిర్మిస్తోన్న ‘జ‌న నాయ‌కుడు’ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 9 జ‌న‌వ‌రి, 2026న పొంగల్ స్పెషల్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. భారీ అంచ‌నాలున్న ఈ సినిమా విజ‌య్‌కి గొప్ప సెండాఫ్‌గా నిల‌వ‌నుందని, మూడు ద‌శాబ్దాల గొప్ప వార‌స‌త్వానికి ఇది గొప్ప వేడుక‌గా నిల‌వ‌నుందని మేకర్స్ చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు