Cooking in Train: కుటుంబ సభ్యులతో ట్రైన్ జర్నీ చేస్తూ, రుచికరమైన ఆహారం తినడంలో ఉండే ఆ కిక్కే వేరు. ఇలాంటి జర్నీ ప్రతి ఒక్కరికీ తప్పకుండా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఒక్క పక్క రూలు దూసుకెళుతుంటే, కిటికీ నుంచి కనిపించే ప్రకృతి అందాలు, ట్రైన్ లోపల కుటుంబ సభ్యులతో సరదా ముచ్చట్లు మాటలకు అందని సంతృప్తిని కలగజేస్తాయి. మధురమైన జ్ఞాపకాలుగా నిలిపోతాయనడంలో ఎలాంటి సందేహం ఉండదు.
అయితే, ఎక్కువమంది ప్యాసింజర్లు తమ ఇంట్లో తయారు చేసికొని ఆహారాన్ని తీసుకొస్తుంటారు. కొందరు ప్యాసింజర్లు రైలులో వేడి భోజనాన్ని ఆర్డర్ చేస్తుంటారు. లేదంటే, రైలు ఆగిన స్టేషన్లలో కొంటుంటారు. అయితే, వీటన్నింటికీ పూర్తి విరుద్ధంగా ఓ మహిళ రైలులోనే ఆహారాన్ని వండిన (Cooking in Train) షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ఒక మహిళా ప్యాసింజర్, తాను ప్రయాణించిన బోగీలోనే వంట చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వీడియోలో సదరు మహిళ, ఏసీ కంపార్ట్‌మెంట్ స్విచ్‌కు ప్లగ్ గుచ్చి ఎలక్ట్రిక్ కెటిల్ ఆన్ చేసింది. ఇన్‌స్టంట్ నూడుల్స్ (మ్యాగీ) వండింది. అంతేనా, ఇందుకు సంబంధించిన వీడియో కూడా రికార్డు చేశారు. రైలులో వంట చేయడాన్ని ఆమె చాలా ఆస్వాదించినట్టుగా కనిపించింది. కెమెరాను చిరునవ్వు చిందించింది.
చర్యలకు దిగిన ఇండియన్ రైల్వేస్
రైలు బోగిలో మ్యాగీ తయారు చేసిన వీడియోను చూసి సెంట్రల్ రైల్వే స్పందించింది. సోషల్ మీడియాలో ఆ వీడియోను ట్యాగ్ చేసి, ఆ ప్రయాణికురాలిపై చర్యల ప్రక్రియను మొదలుపెట్టామని తెలిపింది. రైళ్లలో ఎలక్ట్రానిక్ కెటిల్స్ వాడడం నిషేధమని, ఇది శిక్షార్హమైన నేరమని హెచ్చరించింది. రైలులో ఇలా చేయడం సురక్షితం కాదని, చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చని, ఇతర ప్యాసింజర్లకు అపాయం కూడా జరగవచ్చునని పేర్కొంది. రైలు ప్రయాణంలో కెటిల్ వినియోగం అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఇలాంటి చర్యలు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించవచ్చని, రైలులోని ఏసీతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పోర్ట్‌లు సరిగా పనిచేయకపోవడానికి కారణమవుతాయని తెలిపింది. రైల్వే ప్రయాణాల్లో ఉపయోగించకూడనివాటి జాబితాలో ఎలక్ట్రిక్ కెటిల్ కూడా ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఇండియన్ రైల్వేస్ ఒక ప్రకటన విడుదల చేసింది. రైల్వే ప్యాసింజర్లు ఇలాంటి హానికరమైన చర్యలకు పాల్పడవద్దని, ఇలాంటి చర్యలను తోటి ప్రయాణికులు గుర్తిస్తే, భద్రతను గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరింది.
ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఛార్జింగ్ పాయింట్‌కు ఎలక్ట్రిక్ కెటిల్‌ను కనెక్ట్ చేసి వంట చేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే, ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరేమో కనీస అవగాహన లేకుండా ఇలా చేయడం సరికాదని అంటున్నారు. ఒక ఫ్యామిలీ రైలులో పూజ చేసి అగర్‌బత్తీలు, కర్పూరం కాల్చారని, తాను టీసీకి చెప్పడంతో వారిని హెచ్చరించాడంటూ ఓ నెటిజన్ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. అయితే, ఓ వ్యక్తి స్పందిస్తూ, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు, గానీ ఎలక్ట్రిక్ కెటిల్ వాడితే ప్రమాదకరం ఎలా అవుతుందని ప్రశ్నించాడు.
Action is being initiated against the channel and the person concerned.
Using electronic kettle inside trains is strictly prohibited.
It is unsafe, illegal, and a punishable offence. It can lead to fire incidence and be disastrous for other passengers also.
May also cause… https://t.co/di9vkxrDLv— Central Railway (@Central_Railway) November 21, 2025

