India vs Pakisthan: ఆసియా కప్ లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచులో పాక్ బౌలర్ హారీస్ రౌఫ్ చేసిన సైగలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. భారత్ ను కించపరిచేలా 6-0తో చేసిన హావభావాలు ఎంతో మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది. అయితే దీనిపై వివాదం కొనసాగుతున్న క్రమంలోనే పాక్ మహిళ క్రికెటర్.. రౌఫ్ తరహాలోనే 6 సైగలు చేసి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. ఎక్స్ వేదికగా ఆమె పెట్టిన పోస్టు.. ప్రస్తుతం తీవ్ర వివాదస్పదమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
లాహోర్ లోని గడాఫి క్రికెట్ స్టేడియంలో సోమవారం దక్షిణాఫ్రికా – పాక్ మహిళా జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో పాక్ మహిళా బౌలర్ నష్రా సుంధు 6 వికెట్లు పడగొట్టి.. దక్షిణాఫ్రికా బ్యాటర్లను దెబ్బతీసింది. అదే సమయంలో వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ప్లేయర్ గాను నుష్రా రికార్డ్ సృష్టించింది. ఆమె ప్రదర్శనపై ప్రశంసలు వచ్చినప్పటికీ.. మ్యాచ్ అనంతరం ఆమె చేసిన సిక్స్ ఫింగర్ సైగలు వివాదస్పదంగా మారాయి.
క్యాప్షన్ ఏం పెట్టిందంటే?
మ్యాచ్ తర్వాత నష్రా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘100 వన్డే వికెట్లు పూర్తి చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం నాకు గౌరవంగా ఉంది. నా కుటుంబం, జట్టు సహచరులు, సపోర్ట్ స్టాఫ్ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు. మరింత సంకల్పంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని X (ట్విట్టర్)లో రాసుకొచ్చింది. అయితే ఆమె పోస్ట్ చేసిన ఫొటోల్లో ఒకటి పాక్ క్రికెటర్ హరీస్ రౌఫ్ తరహాలోనే 6 హావాభావాలతో ఉండటంపై భారతీయులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.
Alhamdullillah,
Truly humbled to reach the milestone of 100 ODI wickets with a player of the match award😇 I am grateful to my family, teammates, and support staff for their constant support.Looking ahead with gratitude and determination.🙏 pic.twitter.com/E3GUasY2CR
— Nashra Sundhu (@nashra_sundhu06) September 22, 2025
Also Read: Dasara Offer: మాస్ మసాలా ఆఫర్.. కేవలం రూ.150కే.. మేకపోతు, కేస్ బీర్లు, ఫుల్ బాటిల్!
భారత్ – పాక్ మ్యాచ్ సందర్భంగా..
గత ఆదివారం భారత్ – పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా హారీస్ రౌఫ్.. 6-0 సైగలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు చెందిన 6 ఫైటర్ జెట్లను తాము కుప్పకూల్చినట్లు పాక్ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిని గుర్తు చేస్తూ హారీస్ రౌఫ్ ఈ సైగలు చేయడం గమనార్హం. అంతకుముందు పాక్ బ్యాటర్ సాహిబ్ జాదా ఫర్హాన్ అర్థ శతకం పూర్తి చేసుకొని తుపాకీని ఏకే – 47 తరహాలో చూపిస్తూ సంబురాలు చేసుకున్నాడు. ఈ రెండు చర్యలు పాక్ వైఖరికి అర్థం పడుతున్నాయని పలువురు భారత మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.
Haris Rauf’s ‘6-0’ Gesture Triggers Backlash Amid Asia Cup Drama!
Pakistani pacer Haris Rauf fueled controversy during the Asia Cup Super Four clash by taunting Indian fans with ‘6-0’ and fighter jet gestures, referencing a disputed claim about downing Indian planes. Videos of… pic.twitter.com/m77AZ7t86W
— The Brief India (@TheBrief_India) September 22, 2025