Dasara Offer (Image Source: Twitter)
తెలంగాణ

Dasara Offer: మాస్ మసాలా ఆఫర్.. కేవలం రూ.150కే.. మేకపోతు, కేస్ బీర్లు, ఫుల్ బాటిల్!

Dasara Offer: సాధారణంగా దసరా అనగానే ఎక్కడలేని ఆఫర్లు దర్శనమిస్తుంటాయి. వస్త్రాలు, మెుబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, బైకులు ఇలా చాలా వాటిపై విక్రయదారులు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అటు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనూ బై వన్ గెట్ వన్ ఆఫర్లు లభిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి సైతం దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్ ప్రకటించారు. అయితే అతడు ప్రకటించిన గిఫ్టులు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణలోని జగిత్యాల జిల్లా (Jagtial District) సారంగపూర్ (Sarangapur) గ్రామంలో స్థానిక దుకాణదారుడు సాయిని తిరుపతి ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించాడు. కేవలం రూ.150కే మేక, మద్యం, కోడిని దక్కించుకునే అవకాశాన్ని కల్పించాడు. ఈ ఆఫర్ లో భాగస్వామ్యం కావాలనుకునే వారు ముందుగా రూ.150 పెట్టి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో తమ పేరు వివరాలు రాసి.. పక్కనే ఉన్న లాటరీ బాక్సులో వేయాలి. అలా వచ్చిన టోకెన్ల నుంచి దసరా ముందురోజు లాటరీ తీయనున్నారు.

ఐదు బహుమతులు
లాటరీ రోజున మెుత్తం ఐదు టోకెన్లను ప్రజల సమక్షంలో తీయనున్నారు. తొలి బహుమతి కింద మేకపోతును ఇవ్వనున్నారు. రెండో బహమతిగా కేస్ బీర్లు, 3వ బహుమతిగా ఫుల్ బాటిల్, 4వ బహుమతిగా కోడి, 5వ బహుమతిగా చీరను అందించనున్నారు. కాబట్టి గ్రామంలోని ప్రతీ ఒక్కరు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని దుకాణాదారుడు పిలుపునిచ్చారు.

పండుగ మజా కోసమే..
దసరా సందర్భంగా ఇలాంటి వెరైటీ ఆఫర్ ప్రకటించడం గురించి దుకాణదారుడు మాట్లాడారు. ‘దసరా అంటే మాస్ మసాలా పండుగ. కాబట్టి అది స్పష్టంగా బయటకు కనిపించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ప్రకటించడం జరిగింది. దసరాను మరింత సంబరంగా మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ లాటరీని తీసుకొచ్చాం’ అంటూ చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by BIGTV Live (@bigtv_telugu)

Also Read: Pruthivi Raj – Dulquer: లగ్జరీ కార్ల పన్ను ఎగవేత.. మలయాళం స్టార్స్ ఇళ్లల్లో మెరుపు దాడులు

స్థానికుల రియాక్షన్..
కాగా దసరా నేపథ్యంలో ఇచ్చిన ఈ ఆఫర్ చూసి సారంగపూర్ గ్రామస్తులు అవాక్కవుతున్నారు. రూ.150 పెట్టి టోకెన్ తీసుకునేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ఈ రోజుల్లో రూ.150కి పెద్దగా ఏమి రావడం లేదని.. లాటరీ టికెట్ కొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. తమలో ఎవరు బహుమతి గెలుచుకున్నా అది తమకు సంతోషమేనని చెబుతున్నారు.

Also Read: No Diwali Gifts: ప్రజాధనంతో ఉద్యోగులకు గిఫ్టులా? కేంద్రం కన్నెర్ర.. కీలక ఆదేశాలు

Just In

01

UPI Miracle: భార్య ఫోన్ పోయిందనుకున్న వ్యక్తికి ‘యూపీఐ మిరాకిల్’

Bommala koluvu: దసరా పండుగ ప్రత్యేకం.. పల్లెల్లో బొమ్మల కొలువు సాంప్రదాయాలకు నెలవు

India vs Pakisthan: మెున్న హారీస్ రౌఫ్.. ఇప్పుడు పాక్ మహిళా క్రికెటర్.. నెట్టింట చెత్త పోస్ట్!

Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు.. డాక్టర్ కృష్ణ ప్రసాద్ పిలుపు

Telangana: ప్రభాకర్ రావు సహకరించటం లేదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు