Viral Video: ఒడిశాలో వివాదస్పద ఘటన చోటుచేసుకుంది. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కార్యాలయంలో ఒక సీనియర్ అధికారిపై కొంతమంది వ్యక్తులు దాడికి తెగబడ్డారు. BMC అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూ (Ratnakar Sahoo)ను ఆ వ్యక్తులు కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకెళ్లి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. నేలపైకి తోయడమే కాకుండా తంతూ మెట్ల మీద నుంచి ఈడ్చుకెళ్లారు. ఓ బీజేపీ కార్పోరేటర్ కు చెందిన అనుచరులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా.. ఆవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గ్రివెన్స్ హియరింగ్ సమయంలో..
భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ లో గ్రివెన్స్ హియరింగ్ (Grievance Hearing) జరుగుతుండగా.. కొందరు తనపై దాడి చేసినట్లు బాధిత అధికారి రత్నాకర్ సాహూ తెలిపారు. కొందరు తన చాంబర్ లోకి ప్రవేశించి కాలర్ పట్టుకున్నారని.. కార్పోరేటర్ జగ్ భాయ్ (బిజెపి నాయకుడు జగన్నాథ్ ప్రధాన్) తో తాను అనుచితంగా ప్రవర్తించానని ఆరోపిస్తూ దాడి చేశారని పేర్కొన్నారు. తనను బలవంతంగా వాహనం వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారని తెలిపారు. సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఫిర్యాదు విచారణ నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగిందని వివరించారు.
I am utterly shocked seeing this video.
Today, Shri Ratnakar Sahoo, OAS Additional Commissioner, BMC, a senior officer of the rank of Additional Secretary was dragged from his office and brutally kicked and assaulted in front of a BJP Corporator, allegedly linked to a defeated… pic.twitter.com/yf7M3dLt9C
— Naveen Patnaik (@Naveen_Odisha) June 30, 2025
ఉద్యోగ సంఘాలు సీరియస్
మరోవైపు దాడి ఘటనను భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సిబ్బంది సీరియస్ గా తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగారు. అటు ఒడిశా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ సైతం దాడి ఘటనను ఖండించింది. దాడిని ఖండిస్తూ ఇవాళ (జూలై 1) సామూహిక సెలవుకు పిలుపునిచ్చింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో భువనేశ్వర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా జీవన్ రౌత్, రష్మి మహాపాత్ర, దేబాషిప్ ప్రధాన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
Also Read: Bandi Sanjay: బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా?.. బండి సంజయ్ కీలక వాఖ్యలు!
మాజీ సీఎం ఆగ్రహం
బీఎంసీ అదనపు కమిషన్ పై జరిగిన దాడిపై మాజీ సీఎం, బిజు జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అవమానకర దాడికి కుట్ర పన్నిన రాజకీయ నాయకులు సహా దోషులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం మోహన్ చరణ్ మాఝీని డిమాండ్ చేశారు. దాడి వీడియో చూసి తాను షాక్ అయ్యానని.. అన్నారు. రాజధాని నడిబొడ్డున.. ప్రజల సమక్షంలో ఓ సీనియర్ అధికారిపై ఇలా జరగడం అత్యంత దారుణమని చెప్పుకొట్టారు. సీనియర్ అధికారికే ఇలా జరిగితే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.