NIACL 2025: నిరుద్యోగులకు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ (NIACL) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటించింది. దీనికి సంబందించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 30-08-2025. అర్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ (NIACL) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల కోసం నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి. అర్హత ఉన్న అభ్యర్థులు దానిని క్రింది లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము
SC/ ST / PwBD: రూ. 100/- (GSTతో సహా) (సమాచార ఛార్జీ మాత్రమే)
SC/ ST / PwBD కాకుండా అన్ని అభ్యర్థులు: రూ. 850/- (GSTతో సహా)
NIACL నియామకం 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 07-08-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30-08-2025
దరఖాస్తు వివరాలను సవరించడానికి ముగింపు: 30-08-2025
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: 07-08-2025 నుండి 30-08-2025 వరకు ఉంటుంది.
Also Read: 3000 Year Old Skeletons: 3000 ఏళ్ల క్రితం జరిగిన బలిదానాలు.. బయటపడ్డ 14 అస్థిపంజరాలు.. ఎక్కడంటే?
NIACL నియామకం 2025 వయోపరిమితి
కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
అర్హత
అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, B.E./B.Tech./M.E./M.Tech, LLB, CA, M.B.B.S / M.D. / M.S, B.D.S/ M.D.S, BAMS/BHMS చేసిన వాళ్ళు అర్హులు.
Also Read: Telugu Film Chamber: సినీ కార్మికుల సమ్మె.. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన
వేతనం
బేసిక్ పే స్కేల్ రూ. 50,925/- వేతనాన్ని చెల్లిస్తారు.
NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
లీగల్ స్పెషలిస్ట్‌లు – 50
రిస్క్ ఇంజనీర్లు – 50
ఆటోమొబైల్ ఇంజనీర్లు – 75
అకౌంట్స్ స్పెషలిస్ట్‌లు – 25
AO (హెల్త్) – 50
IT స్పెషలిస్ట్‌లు ప్రభుత్వ నియామకాలు – 25
బిజినెస్ అనలిస్ట్‌లు – 75
కంపెనీ సెక్రటరీ – 02
యాక్చురియల్ స్పెషలిస్ట్‌లు – 05
జనరలిస్టులు – 193