Nagpur Tragedy: మహారాష్ట్ర నాగ్ పూర్ లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య శవాన్ని బైక్ కు కట్టుకొని రోడ్డుపై ప్రయాణిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. ఆమెకు ఏమైందని, అతడు బైక్ పై శవాన్ని ఎందుకు తీసుకెళ్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే?
భార్య శవాన్ని బైక్ పైన తీసుకెళ్తున్న వ్యక్తి పేరు అమిత్ యాదవ్ . నాగ్‌పూర్-జబల్పూర్ నేషనల్ హైవే (Nagpur-Jabalpur National Highway)పై ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ ఘటన రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) రోజున అంటే ఆగస్టు 9న జరిగింది. బాధిత జంట నాగ్‌పూర్‌లోని లోనారా (Lonara) నుండి మధ్యప్రదేశ్‌లోని కరన్‌పూర్ (Karanpur) వెళ్తుండగా మోర్ఫటా (Morphata) దగ్గర ఒక లారీ ఢీకొట్టింది. ఆ సమయంలో భార్య గ్యార్సీ (Gyarsi) రోడ్డుపై పడిపోగా లారీ ఆగకుండా ఆమెపై నుంచి వెళ్లిపోయింది. దీంతో గ్యార్సీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
పట్టించుకోని ప్రజలు
విగతజీవిగా పడి ఉన్న భార్యను తీసుకెళ్లేందుకు భర్త (Amit Yadav).. ఆ మార్గం గుండా వెళ్లే వారి సాయం కోరారు. వాహనాలను ఆపి తన గ్రామానికి తీసుకెళ్లవలిసిందిగా ప్రాధేయపడ్డాడు. అయితే ఎవరు సాయానికి ముందుకు రాకపోవడంతో గత్యంతరం లేక తనే తన భార్యను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రోడ్డుపై పడి ఉన్న భార్య శవాన్ని బైక్ కు కట్టి.. అక్కడి నుంచి గ్రామానికి బయలు దేరాడు.
Also Read: SC on Delhi-NCR: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!
పోలీసులు గుర్తించి.. సాయం
రోడ్డుపై అమిత్ యాదవ్ వెళ్తుండగా.. మార్గమధ్యలో ఓ పోలీసు వాహనం దానిని గమనించింది. పోలీసులు వెంబడించి అతన్ని ఆపారు. ఈ సందర్భంగా వారే వైరల్ అవుతున్న వీడియోను తీసినట్లు తెలుస్తోంది. అమిత్ యాదవ్ బైక్ ఆపి.. మహిళ మృతదేహాన్ని నాగ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ (Indira Gandhi Medical College)కు పోలీసులు తరలించారు. పోస్ట్‌మార్టం (Post-mortem) నిర్వహించేందుకు అక్కడికి పంపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. ఢీకొట్టిన వాహనం కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. బాధిత జంట నాగ్‌పూర్‌లోని లోనారాలో నివసిస్తున్నప్పటికీ వారు మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాకు చెందినవారని అధికారులు తెలిపారు.
नागपुर-जबलपुर राष्ट्रीय राजमार्ग पर एक दिल दहला देने वाली और इंसानियत को झकझोर देने वाली घटना सामने आई है।
एक सड़क दुर्घटना में पत्नी की मौत के बाद जब किसी ने भी मदद नहीं की, तो मजबूर पति ने शव को अपनी मोटरसाइकिल पर बांधकर खुद ही गांव ले जा रहा है।
कैसे हो चले हैं लोग? pic.twitter.com/MmaZszxZmn
— Rahul Kajal INC 🇮🇳 (@RahulKajalRG) August 11, 2025