Mega Fans (image credit:Twitter)
Viral

Mega Fans: మెగాస్టార్ ఓల్డ్ ఫోటో వైరల్.. దమ్ముందా అంటున్న మెగా ఫ్యాన్స్!

Mega Fans: తుపాకుల మునెమ్మ.. ఈ పేరు ఇప్పుడంతగా ఎవరికీ తెలియక పోవచ్చు. ప్రజారాజ్యం పార్టీ పేరెత్తితే మాత్రం ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత గుర్తొచ్చే పేరు మునెమ్మ. ఇది జరిగిపోయిన కథ.. ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? మెగా ఫ్యాన్స్ ఒక ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఒక కూలీ మహిళామణికి టికెట్ ఇచ్చిన మా బాస్.. మెగాస్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఫోటో పాతదే కానీ, కొత్త ట్రెండ్ సృష్టించింది. మునెమ్మ ఒక్కొక్క మాట.. పదును పూసిన కత్తి.. అందుకే నాడు చిరంజీవి పెద్ద ప్రకటనే ఇచ్చారు. ఇలాంటి ధైర్యం నేటి రాజకీయ నాయకులకు ఉందా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశ్నలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ పుట్టిన రోజు సంధర్భంగా మెగా ఫ్యాన్స్ పాత ఫోటో వైరల్ చేస్తూ, మెగా ఫ్యామిలీ అంటే ఇదేనంటూ వైరల్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ చేయడానికి పెద్ద కారణమే ఉంది. అదేంటో తెలుసుకుందాం.

ప్రజారాజ్యం తరపున అన్నిచోట్లా మీటింగ్స్ పెడుతున్న రోజులు అవి. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ కావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అప్పుడే నెల్లూరు జిల్లా కోవూరులో మీటింగ్ సాగుతోంది. ఓ మహిళ సామాన్యురాలిగా వేదిక ఎక్కారు. మైక్ పట్టుకున్న సమయం నుండి ఆమె అనర్గళంగా మాట్లాడుతోంది. ఇంట్లో భర్తలు మద్యానికి అలవాటుపడి కుటుంబాలను నాశనం చేస్తున్న పరిస్థితిని ఆమె వివరిస్తోంది. సభ సైలెంట్.. మెగాస్టార్ ఓ వైపు నిలబడి అలాగే చూస్తూ.. ఆమె మాటలు వింటూ ఉన్నారు. సభకు వచ్చిన ప్రజలు కూడా సైలెంట్ అయ్యారు.

ఆమె ప్రసంగం ముగియగానే మైక్ పట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి, తన పార్టీ తరపున తొలి టికెట్ మునెమ్మకే ఇస్తున్నానని ప్రకటించారు. ఇక అంతే, అందరూ షాక్. మునెమ్మ నోట మాటే రాలేదు. నాడు ఈ విషయంపై రాజకీయ విశ్లేషకులు తెగ చర్చలు సాగించారు. కేవలం ఆమెకు సమాజంపై ఉన్న అవగాహనను గమనించి మెగాస్టార్ టికెట్ ప్రకటించడం అప్పుడు ఒక సంచలనమే. ఇంతకు అక్కడ మైక్ పట్టుకొని మాట్లాడిన మహిళ ఎవరో కాదు.. ఆమె పేరే తుపాకుల మునెమ్మ. ఇంటి పేరుకు తగినట్లు ఈమె మాట్లాడితే, బుల్లెట్లు నేల రాలాల్సిందే.

ఇదంతా 2008లో జరిగిన కథ అయినప్పటికీ, ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దేశ చరిత్రలో కూలీ పనులు చేసుకొనే మహిళకు తన పార్టీ తొలి టికెట్ ఇచ్చి రికార్డు సృష్టించిన ఘనత మెగాస్టార్ కే దక్కుతుందని, నేటి రోజుల్లో ఇలాంటి అవకాశాలు ఎక్కడ అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. నాడు డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారనే అపవాదు వేశారని, అలాంటి చరిత్ర మెగా ఫ్యామిలీలో ఎవరికీ లేదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మునెమ్మను బరిలోకి దించడం కేవలం ప్రకటనే, అది కాదని చాలా వరకు ప్రచారం చేశారని, కానీ తమ హీరో అలాంటి వారు కాదని ఫ్యాన్స్ అంటున్నారు.

megastar - munemma (image credit:Facebook)
megastar – munemma (image credit:Facebook)

Also Read: Baby Tamarind Leaves: చింత చిగురే అనుకుంటున్నారా? ధర తెలిస్తే కంగారే..

రీల్ ను దాటి రియాలిటీ లోకి రావాలంటే దమ్ముండాలని, అది చేసి చూపెట్టిన వ్యక్తి పద్మభూషణ్ డా. కొణిదెల చిరంజీవి అంటూ తెగ పొగిడేస్తున్నారు. అన్న స్పూర్తితో పవన్ కళ్యాణ్, నేడు దేశం గర్వించే స్థాయిలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారని, నాగబాబు కూడా ఎమ్మెల్సీ అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద 17 ఏళ్ల క్రితం నాటి ఫోటో, ప్రస్తుతం వైరల్ కావడంతో తెగ షేర్ అవుతోంది. ఎంతైనా మెగా ఫ్యాన్స్ మజాకా!

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!