Baby Tamarind Leaves: చింత చిగురును ఇష్ట పడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి.. ఇది చూడటానికి చిన్నగా ఉంటుంది. కానీ, మంచి రుచిని కలిగి ఉంటుంది. ‘చింతే’కదా అని చాలా మంది తీసిపారేస్తారు. ఇప్పుడు ఇదే కొందరి జేబులను కాసులతో నింపుతుంది. చింత చెట్లు ఎక్కువగా పల్లె టూర్లలో కనిపిస్తాయి. చింత చిగురు వేసవి కాలంలో బాగా దొరుకుతుంది.
ప్రస్తుతం, మార్కెట్‌లో కిలో ధర రూ.600 కు పలుకుతుంది. అంటే వాటికి పెట్టె డబ్బులతో కేజీ మటన్ వస్తుంది. పల్లెల్లో చాలా మందికి ఇదే జీవనాధారం. ఇక పట్టణాల్లో అయితే, అత్యంత ఖరీదైన వస్తువుగా మారింది. రెండు కిలోల చేపలు, మూడు కిలోల చికెన్ కు సమానంగా ధర పలుకుతుంది. రైతుబజార్లలో చింత చిగురుకు డిమాండ్ బాగా పెరిగింది.
చింత చిగురుతో పప్పు, కూర ఎక్కువగా చేసుకుంటారు. అలాగే, కొందరు ఎండు చేపలలో వేసుకుని వండుకుంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎక్కడకెళ్లినా ఈ కూర ప్రత్యేకతే వేరు. చిటారు కొమ్మలకు దొరికే చింత చిగురును రిటైల్ మార్కెట్లో కిలో రూ.700-600, రైతుబజార్‌లో రూ.600 పలికింది. బయట మారెట్లో 100 గ్రాములను రూ.75 గా అమ్ముతున్నారు. ప్రాణాలకు తెగించి చింత చెట్టు ఎక్కి, కొమ్మల చివరి వరకు వెళ్ళి ఓపికగా చిగురును కోసి తెస్తామని, చాలా కష్టపడితే తప్ప, ఎక్కువ చిగురు కోయలేమని రైతులు చెబుతున్నారు.
Also Read: Dangerous Snake: సముద్రంలో ఉండే వింత పాము.. బయటకొస్తే ప్రళయమే?
దీనిలో ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వంద గ్రాముల చింత చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 26 మి.గ్రాముల మెగ్నీషియం, 3 మి.గ్రాముల విటమిన్ సి, 10.6 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం,140మి.గ్రాముల పాస్ఫరస్ ఉంటాయని చెప్పారు. అలాగే, మన శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. మధుమేహం ఉన్నవారికి ఇది సూపర్ ఫుడ్ అని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Crime News: 8 ఏళ్ల బాలిక పై ఓ కామాంధుడి అఘాయిత్యం..!
చింత చిగురు ఉపయోగాలు :
మనకి వచ్చే అన్ని అనారోగ్య సమస్యలకు మందులను వాడకూడదు. కొన్నింటిని సహజంగానే తగ్గించుకోవాలి. చింత చిగురు లో ఫినాల్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే, దీనిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలున్నాయి. నీటిలో చింత చిగురును వేసి బాగా ఉడికించి పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. చిగురులో ఉండే ఫైబర్ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. మలబద్దక సమస్యతో బాధ పడేవారు దీనిని తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. వైరల్ ఫీవర్ తో బాధ పడేవారు దీనిని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. అలాగే, నోటి పూత సమస్యలను కూడా తగ్గిస్తుంది.