Dangerous Snake: గత కొద్దీ రోజుల నుంచి ప్రపంచమంతా వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే, వీటికి సంబంధించిన ఎన్నో రకాల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని చూస్తుంటే .. యుగాంతం వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాయి. ఎక్కడో సముద్రానికి అడుగు భాగంలో ఉండే ఓర్స్ ఫిష్ కొన్ని నెలల క్రితం మెక్సికోలో ఒడ్డు మీదకు వచ్చింది. అలాగే, కొన్ని లక్షల చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. వీటితో పాటు, లెవియాథాన్ అనే అత్యంత భయంకర పాము భూమి ఉందంటూ ఉందంటూ పలు రకాల కథనాలు వస్తున్నాయి. ఈ పాము 800 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఒక్కసారి బయటకు వచ్చిందా .. ఇక అంతే సంగతి .. ప్రపంచం మొత్తం నాశనమవుతుంది.
Also Read: Bank of baroda Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఉద్యోగాలు.. వేలల్లో జీతం!
“లెవియాథాన్ ” అనే ఈ పాము గురించి పురాణాలు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాయి. ఈ భూమి మీద నివసించే జీవ రాశులలో అత్యంత పెద్దదిగా చెప్పబడింది. అయితే , వాస్తవానికి 800 కిలోమీటర్లు కంటే ఇంకా ఎక్కువగానే ఉంటుందని కొందరు అంటున్నారు. దీని మీద పరిశోధనలు చేసిన వారు ఏం చెబుతున్నాయంటే .. సముద్రంలో దీనికి మించింది ఇంకోటి లేదు .. శక్తివంతమైన జీవిగా చెబుతున్నారు. సైజులో కూడా భారీకి మించి అతి భారీగా ఉంటుంది. ఇక, దీని కవచాలు ఇనుమును పోలి ఉంటాయి, దాని పళ్లు కూడా పెద్ద సైజులో ఉంటాయి. ఇది ఒక్కసారి నిద్ర నుంచి లేచి గట్టిగా గర్జించినప్పుడు, సముద్రం కూడా ఉలిక్కిపడుతుంది. ఆ సమయంలో నోటి నుంచి పెద్ద మంటలు వస్తాయని, అంతటి శక్తి వంతమైన జీవి బయటకొస్తే ప్రళయం వచ్చేలా చేయగలదని అంటున్నారు.
Also Read:Baby Tamarind Leaves: చింత చిగురే అనుకుంటున్నారా? ధర తెలిస్తే కంగారే..
సుమారు 3000 ఏళ్ళ క్రితం లెవియాథాన్ సంబంధించిన ఎన్నో విషయాలు బయటకొచ్చాయి. మెసపోటామియన్స్, క్రిస్టియన్లు వంటి పలు మతాల ప్రజలు ఈ పాము గురించి మాట్లాడుకునేవారు. గత కొద్దీ రోజుల నుంచి వరల్డ్ లో జరుగుతున్న వింత ఘటనలు చూసి ఈ పాము ఇంకా బతికే ఉందని, దాని వలనే సముద్రం నుంచి జీవులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని కొందరు వాదన. ఈ పాము నిజంగానే బతికి ఉంటే .. రావాల్సిన భూకంపం, యుగాంతం ఎప్పుడో వచ్చి మొత్తం నాశనమయ్యేదని మరి కొందరి వాదన. మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.