Crime News: ఇటీవల కాలంలో ఆడపిల్లలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవర్ని వదలడం లేదు. అమ్మాయి ఒంటరిగా రోడ్ మీద కనిపిస్తే చాలు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వావి వరుసలు కూడా మర్చిపోయి.. వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళ పై హత్యాచారం చేయడానికి సిద్దపడుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైజాగ్ లో జరిగిన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Betting Case: బెట్టింగ్ కు ఆజ్యం పోసిందెవరు? ఆ నేత చిట్టా ఈడీకి చేరిందా?
వైజాగ్ వన్ టౌన్ లోని చెంగల్ రావు పేట 8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. పలుమార్లు లైంగిక దాడి చేయడంతో వెంటనే తల్లిదండ్రులకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పోలీసులు బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మరి దారుణంగా 8 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేయడంతో విశాఖ సీపీ శంకబ్రత భాగ్జీ సీరియస్ అయ్యారు. మరోవైపు ఘటనపై హోంమంత్రి అనిత సైతం స్పందించారు. సీపీతో మాట్లాడిన ఆమె బాధ్యుడ్ని కఠినంగా శిక్షించాలని సీపీని అదేశించారు.
Also Read: Degree Jobs: డిగ్రీ పాసయ్యారా.. బ్యాంక్ జాబ్ మీ కోసమే ..!
మరోవైపు బాలికపై అత్యాచారం యత్నం ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న బాలిక అని చూడకుండా ఇంతటి దారుణానికి ప్రయత్నించిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం కోరుకుంటోంది. నిందితుడ్ని చట్టపరంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని పట్టుబడుతోంది. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని బాధిత కుటుంబం బలంగా కోరుకుంటోంది.