Meghalaya Chilli Eater: మేఘాలయ ‘మిరప మహారాజు’ గురించి ఎంత చెప్పినా తక్కువే. 10 కేజీల కాయలు అవలీలగా తింటూ, కళ్లలో బొట్టు పడకుండా నవ్వుతూ చెప్పుకునేవాడు రామ్ పిర్తుహ్.
సాధారణ మనిషికి మిరపకాయ అంటే ఒక్కటి రెండు కొరికితేనే మొహం మొత్తం మారిపోతుంది. నాలుక కూడా మండిపోతుంది. ఒళ్ళంతా చెమటలు కన్నీళ్లతో నిండిపోతాయి. పచ్చిమిర్చి అయితే ‘అబ్బా’ అని కేకలు వేస్తాం, ఎండుమిర్చి అయితే ‘అబ్బో మంట బాబోయ్ ‘ అంటూ అని ఇల్లు మొత్తం పరుగులు తీస్తుంటారు.
కానీ, మేఘాలయలోని ఒక సాధారణ రైతు మాత్రం ఈ మిరపకాయలను తన రోజువారీ ఆహారంగా మలిచి, కేజీల కేజీలు తినేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతని పేరు రామ్ పిర్తుహ్ – 50 ఏళ్ల వయసులోనూ మిరపకాయల ముందు ‘సూపర్‌మ్యాన్’లా నిలబడి, 10 కేజీల ఎండుమిర్చిని చెమటా పట్టకుండా, నవ్వుతూ తినేస్తాడు. ఇప్పుడు అతని పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జైంతియా హిల్స్‌లోని ‘బటావ్’ గ్రామం
మిరపకాయల మధ్య జీవిస్తున్న మిరప మనిషి మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ జైంతియా హిల్స్‌లో, పచ్చని కొండలు, దట్ట అడవుల మధ్యలో బటావ్ అనే చిన్న గ్రామం ఉంది. అక్కడే రామ్ పిర్తుహ్ అనే సాధారణ రైతు తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ, మిరపకాయలు పండించుకుని అమ్ముకుంటూ, రోజులు గడపడం అతని జీవితం. కానీ, ఈ గ్రామంలో మిరపకాయ సాగు చాలా సాధారణం అయినప్పటికీ, రామ్ అవలీలగా కేజీలు కేజీలు తినేసేవాడు.
2011లో స్థానికులు తీసిన ఒక సరదా వీడియో అతని టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘మేఘాలయ మనిషి 10 కేజీల మిరపకాయలు ఒకేసారి తినగలడు’ తినగలడు. ఆ వీడియోను ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వీడియోలో రామ్, ఒక్క కళ్లు కూడా తుడుచుకోకుండా, చెమట పట్టకుండా, బ్యాగుల్లోని ఎండుమిర్చిని స్వీట్స్ తినేస్తునట్లు ” మొత్తం మిరపకాయలను నా లైఫ్‌లో ఒక భాగం. చిన్నప్పటి నుంచి తింటున్నా కాబట్టి, నాకు ఎప్పుడూ కారంగా అనిపించదు” అని నవ్వుతూ చెబుతున్నాడు. ఆ వీడియో చూసినవాళ్లు అందరూ ” వామ్మో వీడు అసలు మనిషేనా ” అని అంటూ అందరూ షాక్ అవుతున్నారు.
