Viral-News
Viral

Dinosaur Condom: అమ్మబాబోయ్.. పురాతన కండోమ్ అవశేషాలు.. డైనోసార్ వాడిందని టాక్!

Dinosaur Condom: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నిత్యం ఏదోక వీడియో వైరల్ అవుతూనే ఉంది. పిల్లల నుంచి పెద్దల దాక.. క్రూర మృగాల నుంచి సముద్ర జీవుల దాక ప్రతీది నెట్టింట ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. రొటిన్ కు భిన్నంగా ఏది కొత్తగా అనిపించినా కూడా.. అందుకు సంబంధించిన దృశ్యాలు, ఫొటోలు విపరీతంగా ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ విచిత్రమైన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. డైనోసార్ కు చెందిన పురాతన కండోమ్ అవశేషాలంటూ నెట్టింట తెగ ప్రచారం చేస్తున్నారు.

మ్యాటర్ ఏంటంటే?

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.. రాయిని సుత్తితో నెమ్మదిగా కొడుతూ రెండు భాగాలుగా చేస్తాడు. అయితే సరిగ్గా రాయి మధ్యలో ఉన్న ఒక అవశేషాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న కండోమ్ ను ఆ పురాతన అవశేషం పోలి ఉండటంతో అతడు ఖంగు తిన్నాడు. ఇప్పటి కండోమ్ పురాతన శిలాజంగా ఎలా మారిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. వీడయోను చూసి తెగ నవ్వుకుంటున్నారు.

నెట్టింట ఫన్నీ కామెంట్స్

రాయి మధ్యలో బయటపడ్డ పురాతన అవశేషానికి నెటిజన్లు ‘ఫాసిలైజ్‌డ్ కండోమ్’ (Fossilised Condom) అని పేరు పెట్టారు. అనంతరం ఆ అవశేషంపై తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. ‘ప్రాచీన కాలంలోనూ సేఫ్టీ ఫస్ట్’ అని పేర్కొన్నారు. మరొకరు ‘ఇది డైనోసార్ కండోమా?’ అని ప్రశ్నించారు. ‘ఈ వీడియో చూసి చాలా ఆశ్చర్యపోయాను. నా రెండు కళ్లను నమ్మలేకపోయా. ఇప్పుడు వాడుతున్న కండోమ్ ప్రాచీన కాలంలోనూ అందుబాటులో ఉందా?’ అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. మరికొందరైతే ఈ వీడియో ఫేక్ అని.. ఏఐతో సృష్టించారని అభిప్రాయపడ్డారు.

Also Read: Viral Video: రైల్వే వంతెనపై రీల్స్.. వెనుక నుంచి దూసుకొచ్చిన వందే భారత్ రైలు, జస్ట్ మిస్!

అసలు నిజం ఇదే!

డైనోసార్ కండోమ్ అంటూ జరుగుతున్న ప్రచారానికి జీవశాస్త్ర నిపుణురాలు చెక్ పెట్టారు. అమెరికన్ జీవ శాస్త్రవేత్త డా. అలిసన్ జాన్సన్ (Dr Allison Johnson) వైరల్ అవుతున్న వీడియోపై స్పందించారు. ‘ఇది కండోమ్ కాదు. బెలెమ్ నైట్ (Belemnites) అనే ఒక ప్రాచీన సముద్ర జీవి. శిలారూపంలో అవశేషంగా మారిపోయింది’ అని స్పష్టం చేశారు. బెలెమ్‌నైట్‌లు అనేవి.. జురాసిక్ కాలానికి చెందినవి. సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించాయి. ఈ సముద్ర జీవుల ముఖ భాగం వెడల్పుగా ఉండి.. కిందకు వచ్చేసరికి తగ్గుతూ వస్తుంది. తాజాగా బయటపడిన వీడియోలో అది ఒక రబ్బర్ వస్తువులా కనిపించడం ఇందుకు కూడా ఒక కారణం. కండోమ్ కు దగ్గరగా ఉండటంతో ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

Also Read: Viral Baby: వార్తల్లో నిలిచిన బేబీ బాయ్.. ఎంత బరువుతో జన్మించాడో తెలుసా?

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?