Viral Video: సోషల్ మీడియా ఫేమ్ కోసం యువత పెద్ద పెద్ద సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒకటి అని కాదు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి రీల్స్ కోసం పిచ్చి పనులు చేస్తున్నారు. ఇక ఇప్పుడు రైల్వే ట్రాక్‌లపై రీల్స్ చేస్తూ ఓ జంట చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
జనాలకు కొత్తగా చూపించాలని థ్రిల్లింగ్ వీడియోలను తీయడానికి ప్రయత్నించి చాలా మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు, అయినప్పటికీ ఈ ట్రెండ్ ఆగడం లేదు. రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ వైరల్ రీల్‌లో ఒక జంట భోజ్‌పురి పాటకి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే, వారి చుట్టూ ఉన్న పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించడం లేదు. ఈ వీడియో సరదాగా, వినోదాత్మకంగా అనిపించినప్పటికీ, వారు ఎంచుకున్న ప్రదేశం సురక్షితం కాదు.
Also Read: Fitness Secrets: 50 ఏళ్ల వయస్సులో కూడా అందంగా కనిపించాలంటే.. ఎలాంటి డ్రింక్ తీసుకోవాలో తెలుసా?
వందే భారత్ రైలు వారి వెనుక నుంచి వెళుతుండగా ఓ కుర్ర జంట రైల్వే ట్రాక్ దగ్గర నిలబడి మరి వీడియో చేస్తున్నారు.
కదులుతున్న రైలుకు ఇంత దగ్గరగా ఉండటం చాలా ప్రమాదకరం, అయినప్పటికీ వారు తమ భద్రత గురించి ఎటువంటి ఆందోళన పడకుండా హ్యాపీగా రీల్స్ చేస్తున్నారు.
Also Read: Harish Rao: జోర్డాన్ గల్ఫ్ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని హరీష్ రావు డిమాండ్!
ఈ వీడియో పై నెటిజన్స్ రక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. “ పొరపాటున అక్కడ ఏదైనా జరిగి ఉంటే అది రీల్ ‘కంటెంట్’ అవ్వదు , రియల్ విషాదం అవుతుంది” అని ఒకరు రాసుకొచ్చారు. మరొకరు, “ఎవరైనా రైల్వే లైన్‌లపై లేదా ప్రమాదకరమైన ప్రదేశాలపై రీల్స్ చేస్తుంటే, ప్రభుత్వం కనీసం 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించాలి లేదా ఐడి సస్పెన్షన్ విధించాలి” అని రాసుకొచ్చారు. ఒక వ్యక్తి, “ఇదంతా డబ్బు కోసమే.. ఉద్యోగం లేకపోతే వేరే పనులు చేసుకోవచ్చుగా .. ఇది చాలా సులభమైన పని అని దీనిని ఎంచుకుంటున్నారా ? ఇదైతే తక్కువ-IQ కంటెంట్ ” అని పేర్కొన్నాడు. మరొకరు, “వారు వాక్‌వేలోకి ఎలా ప్రవేశించారు? దానిని తరలింపు సమయంలో మాత్రమే ఉపయోగించాలి.” అంటూ రాసుకొచ్చాడు.
