Lizards: చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫేమస్ అవ్వాలని రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎవరికీ వారు తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక.. ఎవరికి వారు, వారి సొంత టాలెంట్ ను బయట పెడుతున్నారు.
ప్రపంచంలో (World) ఏం జరిగినా సరే.. క్షణాల్లోనే స్మార్ట్ ఫోన్లో వైరల్ అవుతోంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారు. ఒక్క వీడియోతో ఫేమస్ అయిపోవాలని చేయకూడని పనులు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తి ఒంటి నిండా బల్లులు పాకుతున్నాయి. వామ్మో ఇది చూడటానికే చాలా భయంకరంగా ఉంది. ఈ వీడియోని మీరు చూశాక .. షాక్ అవ్వకుండా ఉండలేరు.
ఒక వ్యక్తి ఇంట్లో బల్లులను పెంచుతున్నాడు. అయితే, వాటిని పట్టుకుని బాక్స్ లో వేసే సమయంలో అవి నేలంతా పాకుతూ, అతని మీదకు కూడా ఎక్కాయి. బల్లులు అంటే భయం ఉన్న వారు.. ఈ వీడియో చూస్తే వణికిపోతారు. అలాంటి వారు ఈ వీడియోని చూడకపోవడమే మంచిది. ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.