viral
Viral

Viral: ఐపీఎల్ ఎఫెక్ట్.. ఉద్యోగమే ఊడింది.. మరీ ఇంత పిచ్చా!

Viral: ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే చాలు ఈ మధ్య చిన్నా పెద్దా ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ సీజన్ వస్తే చాలు అత్యవసరల పనులు కూడా లైవ్ చూస్తూ చేస్తుంటాం. ఐపీఎల్ ఫీవర్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిపే సంఘటన ఇది. మహారాష్ట్ర ఆర్టీసీ డిపోకి చెందిన ఓ బస్సు డ్రైవర్ ప్రయాణికుల భద్రత మరచి ఏకంగా లైవ్ మ్యాచ్ చూస్తూనే బస్సును నడపడం కలకలం రేపింది. అదృష్టవశాత్తూ అపాయం జరగలేదు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డ్రైవర్ ఉద్యోగం పోయింది.

ముంబయి- పుణె మార్గంలో శనివారం ఎంఎస్‌ఆర్టీసీ ‘ఈ-శివనేరీ’ బస్సులో డ్రైవర్‌ ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ జాలీగా బస్సును నడుపుతున్నాడు. ఓవైపు ప్రయాణికులు దాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఎలా చెప్పాలో తెలియక ఆందోళన పడుతున్నారు. ఆ లోపే అందులో ఉన్న ఓ తెలివైన ప్రయాణికుడు.. ఆ డ్రైవర్ నిర్వాకాన్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. .. ఆ వీడియోను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ప్రతాప్‌ సర్నాయిక్‌కు పంపించాడు. అంతటితో ఆగక ఆ వీడియోను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తోపాటు రవాణాశాఖ మంత్రికీ ట్యాగ్‌ చేశారు.

viral: అంతర్జాతీయ మార్కెట్లో దుమ్ము లేపుతున్న గోలీసోడా.. డిమాండ్ మాములుగా లేదు!

ఈ ఘటనపై స్పందించిన మంత్రి సర్నాయిక్‌.. వెంటనే డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. తక్షణమే స్పందించిన అధికారులు.. ప్రయాణికుల భద్రతను విస్మరించాడని పేర్కొంటూ సదరు డ్రైవర్ ను విధుల నుంచి డిస్మిస్‌ చేశారు. అతను పనిచేస్తుంది ఓ ప్రైవేటు సంస్థ కింద కాగా.. దానికీ రూ.5,000 జరిమానా విధించారు.

మరోవైపు.. ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున రవాణాశాఖ మంత్రి సీరియస్ స్పందించారు. ముంబయి- పుణె మార్గంలో యాక్సిడెంట్‌ రహిత సర్వీసుగా ‘ఈ-శివనేరీ’కి మంచి పేరుందని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే మాత్రం డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఎస్‌ఆర్టీసీ కింద పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అవి తమ డ్రైవర్లకు క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆటో, టాక్సీ డ్రైవర్ల విషయంలోనూ ఫోన్‌ వాడకంపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఇటువంటివాటిని కట్టడి చేసేందుకు త్వరలోనే కొత్త నిబంధనలను ప్రవేశపెడతామని మంత్రి సర్నాయిక్‌ చెప్పారు.

Just In

01

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు