Earthquake in Myanmar
Viral

Earthquake in Myanmar: ఇదేం భూకంపం.. కదిలే రైలులో ప్రళయ రూపం..

Earthquake in Myanmar: మయన్మార్‌, బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించినట్లు అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. భారీ భూకంపం కారణంగా అక్కడి ప్రజలు రోడ్లపై పరిగెడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు భారీ భవనాలు సైతం కుప్పకూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే  ప్రకంపనల ధాటికి మెట్రో రైలు ఊగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఊగిపోయిన ట్రైన్..
భూప్రకంపన ధాటికి ఓ మెట్రో స్టేషన్ లోని రైళ్లు ఊగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. భూకంపం ఏ స్థాయిలో వచ్చిందో అని చెప్పేందుకు ఈ వీడియోలే నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టన్నుల కొద్ది బరువుండే మెట్రో రైళ్లు ఇలా అట్టముక్కలా అటు ఇటు కదిలిపోవడాన్ని చూసి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకృతి విపత్తు నుంచి ప్రజలు బయటపడాలని కోరుకుంటున్నారు.

Also Read: Peddapalli Crime: పెద్దపల్లి జిల్లాలో సంచలనం.. మరో ప్రేమికుడి దారుణ హత్య

బిల్డింగ్ నుంచి పడ్డ స్విమ్మింగ్ నీళ్లు
భారీ భూకంపం ధాటికి బ్యాంకాక్ లోని పెద్ద పెద్ద భవనాలు చిగురుటాకులా కదిలిపోయాయి. ఈ క్రమంలో ఓ ఎత్తైన స్టార్ హోటల్ పైన ఉన్న స్విమ్మింగ్ నీళ్లు.. ప్రకంపన ధాటికి కిందపడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?