Viral Video: చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు మ్యాజిక్ ట్రిక్స్ అంటే ఆసక్తి. ఇవి ఎక్కడైనా కనిపిస్తే చాలు అలాగే చూస్తుంటారు. నిజ జీవితంలోనైనా, ఇంటర్నెట్‌లోనైనా.. ఈ మాయాజాలం, ఆ చిన్న చిన్న భ్రమలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. తాజాగా, ఒక చిన్నారి చేసిన రాళ్ల ట్రిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి, మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక స్కూల్ విద్యార్థి బెంచ్ దగ్గర తన స్నేహితుల మధ్య రాళ్లతో మ్యాజిక్ చూపిస్తున్నాడు. మొదటగా అతను చేతుల్లో రెండు నల్లరంగు చిన్న రాళ్లను అందరికీ చూపించి, వెంటనే వాటిని డెస్క్‌పై చేతుల్ని తిప్పి దాచి పెట్టాడు. కొంత సేపటి తర్వాత ఒక చెయ్యి పైకి తియ్యగానే రాయి కనిపించదు. మరో చెయ్యి తీసినా కూడా రాళ్లు కనిపించవు. అయితే, అతను ఎక్కడ నుంచి తీశాడో ఆ రెండు రాళ్లు అక్కడే కనిపిస్తాయి. ఈ ట్రిక్ చూసి చుట్టూ ఉన్న విద్యార్థులు కూడా ఆశ్చర్యంతో చప్పట్లు కొడతారు. వీడియో తీస్తున్న వ్యక్తి అభ్యర్థనపై చిన్నారి అదే ట్రిక్‌ను మరోసారి చేస్తాడు. రెండోసారి కూడా అతని వేగాన్ని చూసి అందరూ షాక్ అవుతారు.
@sahil.aazam పేరుతో పోస్ట్ చేసిన ఈ రీల్ ఇప్పటి వరకు 80 మిలియన్ వ్యూస్ దాటింది. వీడియోపై రియాక్షన్ క్లిప్స్, రీమిక్స్‌లు వరుసగా వస్తుండగా, చాలామంది ఈ ట్రిక్‌ను డీకోడ్ చేయడానికి పదే పదే చూస్తున్నట్లు కామెంట్స్‌లో వెల్లడించారు. “ దగ్గరికి వెళ్లాం కానీ అతని స్పీడ్‌కు దగ్గర కాలేం.. ఇదంతా స్పీడ్ మ్యాజిక్,” అని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిన్నారి సాదాసీదా రాళ్ల ఆటతో చేసిన మ్యాజిక్ ఇప్పుడు గ్లోబల్ సోషల్ మీడియాను ఇంప్రెస్ చేస్తోంది.

