Maredumilli Encounter: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై సస్పెన్స్ కొనసాగుతున్నది. మావోయిస్ట్ కీలక నేతలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్యలు 15 రోజుల క్రితమే తెలంగాణ ఎస్ఐబీ ఎదుట లొంగిపోవాలని నిర్ణయంతో వారి కంట్రోల్‌లో ఉన్నారు. దేవ్‌జీ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్, పోలిట్ బ్యూరో సభ్యుడు కాగా, ఆజాద్ సెంట్రల్ కమిటీ మెంబర్. ప్రస్తుతం వీరిద్దరిని ఎస్ఐబీ అధికారులు ఇంటరాగేషన్ చేస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయేందుకు అబూజ్ మడ్‌ను ఆజాద్ వదిలినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి.
ఆజాద్ కార్యకలాపాలపై ఆరా
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా పోలీసులు దేవ్‌జీ, ఆజాద్ కార్యకలాపాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. లొంగుపాటు ఎత్తుగడలో భాగంగా తెలంగాణ ఎస్ఐబీ పోలీసులను ఆశ్రయించినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే బీజాపూర్ నుంచి ఒడిశా తర్వాత ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోకి హిడ్మా తన సభ్యుల బృందంతో చేరుకున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, సీఆర్పీఎఫ్ బెటాలియన్, ఆక్టోపస్ అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి.
పోలీసులను ఆశ్రయించిన ఆజాద్
మొదటిరోజు జరిగిన కాల్పుల్లో హిడ్మా తోపాటు ఆయన భార్య రాజే, దేవే, లక్మల్ అలియాస్ చేతు, మల్ల అలియాస్ మల్లలు, కములు అలియాస్ కమలేష్ మృతి చెందారు. రెండో రోజు జరిగిన కాల్పుల్లో మోటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత అలియాస్ జ్యోతి, సురేష్, గణేష్, వాసు, అనిత, షమ్మి మృతి చెందారు. దేవ్‌జీ, ఆజాద్‌ల సమాచారంతోనే ఎస్ఐబీ మోస్ట్ వాంటెడ్ హిడ్మా బృందంపై దాడి చేసినట్లుగా తెలుస్తున్నది. లొంగి పోదామని పోలీసులను ఆశ్రయించిన ఆజాద్, దేవ్‌జీ పోలీసులకు సమాచారం అందివ్వడంతోనే ఎదురు కాల్పులు జరిగాయని సమాచారం. బుధవారం సైతం మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్ కూడా వారు ఇచ్చిన సమచారంగా తెలుస్తున్నది.
Also Read: Fertility Centers: ఫెర్టిలిటీ సెంటర్లపై సర్కార్ ఫుల్ సీరియస్.. మూడు సెంటర్ల సీజ్!

